రవి మృతిపై సిద్దుకు రాజ్‌నాథ్ ఫోన్: ఢిల్లీలో బిజెపి ఎంపీల ధర్నా
బెంగళూరు: ఐఏఎస్ అధికారి రవి అనుమానాస్పద మృతి కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ కర్ణాటకకు చెందిన కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణంలో గురువారం ఉదయం ధర్నా నిర్వహించారు. రవి కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు.
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం రవి కుటుంబానికి అన్యాయం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నదని వారు ఆరోపించారు. అనంతరం కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు కేంద్ర హొం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు. ఐఏఎస్ రవి అనుమానస్పద స్థిలో మృతి చెందారని, రాష్ట్రం మొత్తం నిరసనలు వ్యక్తం అవుతున్నాయని ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు. మీడియాలో వచ్చిన వార్తల కటింగ్ లు చూపించారు.

సీఎం సిద్దుకు ఫోన్ చేసిన రాజ్ నాథ్ సింగ్
కేంద్ర మంత్రులు అనంత్ కుమార్, సదానందగౌడ, మాజీ ముఖ్యమంత్రి బీ.ఎస్. యడ్యూరప్ప తదితరులతో మాట్లాడిన రాజ్ నాథ్ సింగ్ తగిన చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు. వెంటనే వారి ముందే రాజ్ నాథ్ సింగ్ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు పోన్ చేశారు. ఐఏఎస్ రవి కేసు వివరాలు అడిగారు.
సీఐడితో ఐఏఎస్ రవి కేసు దర్యాప్తు చేయిస్తున్నామని, సీబీఐ దర్యాప్తు అవసరం లేదని సీఎం సిద్దరామయ్య కేంద్ర హొం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు చెప్పారని తెలిసింది. వెంటనే ఐఏఎస్ రవి కేసు దర్యాప్తు నివేదిక తమకు పంపించాలని రాజ్ నాథ్ సింగ్ సూచించారు.
కర్ణాటకను కుదిపేసిన ఐఏఎస్ రవి మృతి కేసు నివేదిక పంపించాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సీఎం సిద్దరామయ్యకు ఆదేశాలు జారీ చేశారు. దెబ్బ మీద దెబ్బ పడుతుండటంతో సీఎం సిద్దరామయ్య ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ప్రతిపక్షాలకు, మీడియాకు సమాధానం చెప్పలేకపోతున్నారు.












Click it and Unblock the Notifications