ఇద్దరు శృంగారంలో పాల్గొంటే పెళ్లి చేసుకోవాలనేం లేదు : ముంబై సెషన్స్ కోర్టు సంచలన వ్యాఖ్యలు
ప్రేమించుకుని, చెట్టాపట్టాలేసుకుని తిరిగి, కలిసి ఫోటోలు దిగి, పెళ్లికి ముందే లైంగిక సంబంధాన్ని కొనసాగించి ఆ తరువాత వివిధ కారణాలతో బ్రేకప్ అవుతున్న ఘటనలు నిత్యం చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఇలాంటి ఘటనలలో కేసులు పెడుతున్న మహిళలకు కోర్టు వ్యాఖ్యలు షాక్ ఇస్తున్నాయి.పెళ్ళికి ముందు లైంగిక సంబంధాలు పెట్టుకుని ఆపై కొందరు వాటిని లైట్ తీసుకుంటే, మరికొందరు వాటిని సీరియస్ గా తీసుకుని తనను మోసం చేశాడంటూ ప్రేమించిన వ్యక్తి ఇంటిముందు ఆందోళనలు చేస్తున్నారు. తమను శారీరకంగా లోబరుచుకున్నారు అని, పెళ్లి చేసుకోను పొమ్మంటున్నారు అని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇక అలాంటి వారికి షాకింగ్ విషయాన్ని వెల్లడించింది ముంబై కోర్టు.

ఇద్దరు వ్యక్తుల మధ్య లైంగిక సంబంధం ఉన్నంత మాత్రాన పెళ్లి తప్పనిసరి కాదు
ఇద్దరు వ్యక్తుల మధ్య లైంగిక సంబంధం ఉన్నంత మాత్రాన వారు పెళ్లి చేసుకోవడం తప్పనిసరి ఏమీ కాదంటూ ముంబై సెషన్స్ కోర్టు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ అత్యాచారం కేసులో విచారణ సందర్భంగా న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. పెళ్లి విషయంలో ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనేది ఎవరికివారు నిర్ణయించుకుంటారని, ఇందులో ఎవరినీ బలవంతం చేయకూడదని ముంబై సెషన్స్ కోర్టు పేర్కొంది. ఇద్దరు వ్యక్తులు శృంగారంలో పాల్గొన్న అంతమాత్రాన వారు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలని రూలేమీ లేదని కోర్టు వెల్లడించింది.

ఒక అత్యాచారం కేసులో కోర్టు కీలక వ్యాఖ్యలు
తనపై అత్యాచారం చేశాడని ఓ మహిళ ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించిన పూర్వాపరాలను పరిశీలించిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ సంవత్సరం జనవరిలో తనకు పెళ్లి అయిందని పెళ్లి తర్వాత తాను అత్తవారింట్లో రెండు నెలల పాటు ఉన్నానని తన భర్త, మామ, భర్త స్నేహితుడు నిత్యం తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఓ మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పోలీసులు గృహహింస చట్టంతో పాటుగా, వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. భర్తను ప్రధాన ముద్దాయిగా పేర్కొని అతని తండ్రిని రెండో ముద్దాయిగా, స్నేహితుడిని మూడో ముద్దాయిగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

పెళ్లి పేరుతో లోబర్చుకున్నారని కేసు పెట్టిన మహిళ.. కోర్టు కీలక వ్యాఖ్యలు
ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత సదరు మహిళ మళ్లీ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. తనను అతడు పెళ్లి చేసుకోలేదని, పెళ్లి పేరుతో తనను లోబర్చుకొని తనకు దగ్గరయ్యాడు అంటూ, ఆ తర్వాత తనను మోసం చేశాడంటూ ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పోలీసులు మరికొన్ని సెక్షన్లను జోడించి కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసును విచారించిన ధర్మాసనం నిందితుడిపై తొలి ఎఫ్ఐఆర్ నమోదు అయ్యేవరకు ఆమె ఆ వ్యక్తి తో కలిసి అనేక చోట్లకి వెళ్లిందని, ఎఫ్ఐఆర్ నమోదు అయిన తర్వాత కూడా థానే లోని ఓ హోటల్ లో వారు కలిసి ఉన్నట్లుగా చెప్పిన వివరాలను బట్టి వారిద్దరికీ ఎఫైర్ ఉందని పేర్కొన్నారు. ఆమె ఇష్టపూర్వకంగానే అతనితో లైంగిక సంబంధాన్ని కొనసాగించినట్లు అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత ఏదో కారణంతో వారి బంధం తెగిపోయింది ఉండొచ్చని భావించిన న్యాయమూర్తులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మహిళ మేజర్ .. చాలా కాలంగా సంబంధం .. మోసం చేశారని భావించలేం
నిందితుడిపై ఫిర్యాదు చేసిన మహిళ మేజర్ అని, విద్యావంతురాలు కూడా అని పేర్కొన్న కోర్టు పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొంటే కలిగే పర్యవసానాల గురించి ఆమెకు తెలుసు అని, ఇక ఆ వ్యక్తితో తనకు చాలా కాలంగా పరిచయం ఉందని చెప్పిన కారణంగా పెళ్లి పేరుతో అతను ప్రలోభ పెట్టాడు అని భావించడానికి వీలు లేదని అభిప్రాయం వ్యక్తం చేసింది ధర్మాసనం. ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అరెస్ట్ చేస్తే వారి స్వేచ్ఛకు భంగం కలిగించినట్టు అవుతుందని పేర్కొంది. నిందితులు కస్టడీలో ఉండాల్సిన అవసరం లేదని అభిప్రాయపడిన కోర్టు ముందస్తు బెయిల్ పొందే హక్కు నిందితులకు ఉందని తేల్చిచెప్పింది.

ఓ బెయిల్ దరఖాస్తు విషయంలో చేసిన వ్యాఖ్యలు .. ఈ కేసుకే పరిమితం అంటూ సూచన
ప్రస్తుతం న్యాయస్థానం ముందుకు వచ్చిన బెయిల్ దరఖాస్తుకు మాత్రమే ఈ వ్యాఖ్యలు పరిమితమని సూచించింది. అయితే ప్రస్తుత సమాజంలో ఏళ్ల తరబడి ప్రేమించుకోవడం, పెళ్లికి ముందు లైంగిక సంబంధాలను కొనసాగించడం, ఆ తర్వాత వివిధ కారణాలతో రిలేషన్ దెబ్బతింటే రచ్చ చేయడం అలవాటుగా మారింది. ముఖ్యంగా మేజర్లు, చదువుకున్న అమ్మాయిలు పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొంటే కలిగే అనర్థాలను తెలుసుకుని, తదనుగుణంగా ప్రవర్తించాల్సిన అవసరముందని, చీటికిమాటికి మోసపోయామంటూ కేసులు పెట్టడం వారి సమస్యకు ఏ మాత్రం పరిష్కారం కాదన్న అభిప్రాయం కోర్టు చేసిన వ్యాఖ్యల వల్ల వ్యక్తమవుతోంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications