వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీట్-2021 రద్దు కాలేదు: ఆన్‌లైన్‌లో నిర్వహిస్తాం -సీబీఎస్ఈ-2021 ఆఫ్‌లైన్‌లోనే -జేఈఈ-2021పైనా కేంద్రం క్లారిటీ

|
Google Oneindia TeluguNews

కరోనా విలయం కారణంగా ఈ (2020-21)విద్యాసంవత్సరం కుదుపులకు గురికాగా, వచ్చే ఏడాది(2021-22)కూడా గంగలో కలవడం ఖాయమనే భయాలు పెరిగింది. అన్ లాక్ లో భాగంగా అన్నీ తెరిచినా, విద్యా సంస్థలను మాత్రం ఇంకా మూసేఉంచుతూ, ఎప్పుడు తెరుస్తారో కూడా క్లారిటీ లేకపోవడంతో 2021లో జరగాల్సిన పోటీ పరీక్షలన్నీ రద్దయి పోతాయనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నీట్-2021 రద్దు నిర్ణయం తీసుకున్నారంటూ వార్తలు రావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. వారిలో అనుమానాలను తీర్చేందుకు కేంద్రం ఎట్టకేలకు ముందుకొచ్చింది. 2021లో ఏ పరీక్షను కూడా రద్దు చేసే ఆలోచలన లేదని కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ స్పష్టం చేశారు.

మోసపోయిన చీఫ్ జస్టిస్ బోబ్డే తల్లి -నాగ్‌పూర్‌ ఆస్తులకు కేర్‌టేకర్ టోకరా -డీసీపీ వినితా ఎంట్రీతో..మోసపోయిన చీఫ్ జస్టిస్ బోబ్డే తల్లి -నాగ్‌పూర్‌ ఆస్తులకు కేర్‌టేకర్ టోకరా -డీసీపీ వినితా ఎంట్రీతో..

వచ్చే ఏడాదిలో నిర్వహించాల్సిన సీబీఎస్ఈ పరీక్షలతోపాటు జేఈఈ మెయిన్, నీట్‌ వంటి పోటీ పరీక్షల నిర్వహణపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో చర్చలు జరిపి, వారి అభిప్రాయలను కూడా తెలుసుకునేందుకుగానూ కేంద్ర విద్యా మంత్రి రమేశ్ పోఖ్రియాల్ గురువారం వెబినార్ నిర్వహించారు. #EducationMinisterGoesLive హ్యాష్‌ట్యాగ్‌ ద్వారా నిర్వహించిన వెబినార్ కు భారీ స్పందన వచ్చింది. అందులో..

 No plan to cancel NEET 2021, Multiple Attempts For JEE Main, offline cbse 2021:Pokhriyal

మెడికల్ కోర్సుల ఎంట్రెన్స్ టెస్టులపై: నీట్‌-2021 పరీక్ష రద్దవుతోందంటూ వస్తున్నవి తప్పుడు వార్తలని, వచ్చే ఏడాది నీట్ ను కచ్చితంగా నిర్వహిస్తామని, అయితే ఈసారి ఆన్ లైన్ ద్వారా పరీక్ష నిర్వహించే ఆలోచన చేస్తున్నట్లు మంత్రి పోఖ్రియాల్ స్పష్టం చేశారు. అలాగే,

ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలపై: గురువారం నాటి వెబినార్ లో జేఈఈ (మెయిన్‌)-2021 పరీక్షలపైనా మంత్రి క్లారిటీ ఇచ్చారు. జేఈఈ 20201 దరఖాస్తు ప్రక్రియ ఈ డిసెంబర్ నుంచే ప్రారంభం అవుతుందని, పరీక్షను జనవరికి బదులుగా ఫిబ్రవరి చివరి వారంలో నిర్వహిస్తామని, ఏప్రిల్‌ జరగాల్సిన రెండో విడత జేఈఈ (మెయిన్‌)-2021 పరీక్షలను సెప్టెంబర్‌లో నిర్వహిస్తామని, అదే సమయంలో అటెంప్ట్‌ల సంఖ్యను గరిష్టంగా 4కు పెంచుతామని తెలిపారు.

RRR:వైసీపీకి మేకు -జగన్‌కు తలపోటు -రాజుకు చెక్ పెట్టేదెవరు? -చంద్రబాబును తలదన్నిన రఘురామRRR:వైసీపీకి మేకు -జగన్‌కు తలపోటు -రాజుకు చెక్ పెట్టేదెవరు? -చంద్రబాబును తలదన్నిన రఘురామ

సీబీఎస్‌ఈ -2021: ఈ ఏడాది సీబీఎస్‌ఈ పరీక్షలను ఆఫ్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నట్లు విద్యా మంత్రి పేర్కొన్నారు. ఈ పరీక్షలు పెన్‌-పేపర్‌లో మోడ్‌లో జరుగుతాయన్నారు. ప్రాక్టికల్‌ ఎగ్జామ్స్‌ రాయడానికి విద్యార్థులు స్కూళ్లకు పోవడం వీలు కాని పక్షంలో ప్రత్యామ్నాయాలను ఆలోచిస్తామన్నారు.

English summary
Education Minister Ramesh Pokhriyal ‘Nishank’ on Thursday ruled out the possibility of postponing NEET 2021 amid concerns raised by students in the wake of the Coronavirus pandemic. The minister gave an update on JEE Main 2021, NEET 2021, Board Exams 2021, and other entrance exams. There is no plan to cancel NEET 2021, the education minister asserted. Pokhriyal was addressing a live interaction with students, parents and teachers when he made the remark.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X