బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శశికళ రాయల్ లైఫ్: క్లారిటీ ఇచ్చిన హోం మంత్రి రామలింగా రెడ్డి, తమిళ్ లో చిన్నమ్మతో ?

బెంగళూరు సెంట్రల్ జైల్లో చిన్నమ్మ శశికళ రాజభోగాలు.అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చిన హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి.శశికళతో తమిళంలో మాట్లాడిన మంత్రి రామలింగా రెడ్డి, ఆమె ఆరోగ్యం ఎలాగుందని ఆరా ?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి శశికళకు ప్రత్యేక సౌకర్యాలు ఏమీ కల్పించడం లేదని కర్ణాటక రాష్ట్ర హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

స్పీకర్ నోటీసులు: నేడు డెడ్ లైన్: అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు ఏం చేస్తారు, సీఎం పళని ?స్పీకర్ నోటీసులు: నేడు డెడ్ లైన్: అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు ఏం చేస్తారు, సీఎం పళని ?

తాను స్వయంగా పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు వెళ్లి శశికళకు ప్రత్యేక సౌకర్యాలు ఏమైనా కల్పిస్తున్నారా ? అని పరిశీలించానని రామలింగా రెడ్డి అన్నారు. కర్ణాటక హోం శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత రామలింగా రెడ్డి మొదటిసారి పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించారు.

ఖైదీల సమస్యలు

ఖైదీల సమస్యలు

పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలతో మాట్లాడిన రామలింగా రెడ్డి వారి సమస్యలు, ఆరోగ్యం, అక్కడి జైలు అధికారులు కల్పిస్తున్న సౌకర్యాల గురించి క్షణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి మహిళ ఖైదీలు ఉంటున్న బ్యారెక్ లు పరిశీలించారు.

శశికళతో తమిళ్ లో మాట్లాడిన మంత్రి

శశికళతో తమిళ్ లో మాట్లాడిన మంత్రి

ఇదే సమయంలో అన్నాడీఎంకే పార్టీ మాజీ నాయకురాలు శశికళ ఉంటున్న బ్యారెక్ ను రామలింగా రెడ్డి పరిశీలించారు. తమిళ బాషలోనే శశికళతో మాట్లాడి ఆమె ఆరోగ్యం ఎలా ఉందని మంత్రి రామలింగా రెడ్డి ఆరా తీశారని సమాచారం. అనంతరం జైలు నుంచి బయటకు వచ్చిన మంత్రి రామలింగా రెడ్డి మీడియాతో మాట్లాడారు.

జైల్లో శశికళ, ఇలవరసి !

జైల్లో శశికళ, ఇలవరసి !

పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళ, ఇళవరసి, సుధాకరన్ లకు ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం లేదని, సర్వసాధారణ ఖైదీలులాగే ఆ ముగ్గురు శిక్ష అనుభవిస్తున్నారని రామలింగా రెడ్డి వివరించారు. మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి అన్నారు.

జైల్లో వంట గదులు

జైల్లో వంట గదులు

పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఖైదీల కష్టసుఖాల గురించి పూర్తి వివరాలు సేకరించానని, అక్కడి వంట గదులు, స్వచ్చత ఎలా పాటిస్తున్నారు అని పూర్తిగా పరిశీలించానని, కొందరు ఖైదీల సమస్యలు తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించాలని అక్కడి అధికారులకు సూచించానని మంత్రి రామలింగారెడ్డి అన్నారు.

ఇంతలోనే మార్పులు

ఇంతలోనే మార్పులు


శశికళకు ఐదు ప్రత్యేక గదులు కేటాయించామని, వంట గది ప్రత్యేకంగా ఉందని, ఇప్పటి వరకూ ఆమెను కుటుంబ సభ్యులతో పాటు అన్నాడీఎంకే పార్టీ నాయకులు 24 మంది కలిశారని జైలు అధికారులు సమాచారం చట్టం కింద ఆర్ టీఐ కార్యకర్తకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలోనే మంత్రి రామలింగా రెడ్డి ఆకస్మికంగా పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు పరిశీలించి మీడియాకు ఇలా క్లారిటీ ఇచ్చారు.

English summary
There is no truth in reports suggesting that Sasikala and Elavarasi have been given preferential treatment at the prison. I had been there yesterday and I saw it for myself state Home Minister Ramalinga Reddy told reporters in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X