• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

యూపీలో ఉంది రామరాజ్యం కాదు అటవీ రాజ్యం ... ప్రజాస్వామ్యంపై సామూహిక అత్యాచారం : శివసేన ఫైర్

|
Google Oneindia TeluguNews

హత్రాస్ సంఘటనపై శివసేన యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై విరుచుకుపడింది. రాష్ట్రంలోని అయోధ్యలో రామాలయానికి పునాది రాయి వేసినప్పటికీ ఉత్తరప్రదేశ్‌లో రామరాజ్యం లేదని, రాక్షస రాజ్యం , అటవీ రాజ్యం కొనసాగుతుందని శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది . మహారాష్ట్రలోని అధికార పార్టీ ఇటీవల యుపిలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు , దారుణాల కట్టడి విషయంలో యూపీ సర్కార్ విఫలం అయ్యిందని పేర్కొంది .

రాజస్థాన్‌లోనూ అదే దారుణం: ఇద్దరు మైనర్ బాలికలపై గ్యాంగ్ రేప్..మూడు రోజుల పాటు..! రాజస్థాన్‌లోనూ అదే దారుణం: ఇద్దరు మైనర్ బాలికలపై గ్యాంగ్ రేప్..మూడు రోజుల పాటు..!

 యూపీ అత్యాచార ఘటనలపై భగ్గుమన్న శివసేన

యూపీ అత్యాచార ఘటనలపై భగ్గుమన్న శివసేన

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అయోధ్యలో రామ మందిరానికి పునాది వేశారు. అయినా ఉత్తర ప్రదేశ్‌లోరామ రాజ్య ఆదర్శ పాలన లేదని , శాంతిభద్రతల పరంగా యుపిలో అటవీ రాజ్యం కొనసాగుతుందని శివ సేన పార్టీ మౌత్ పీస్ 'సామ్నా' సంపాదకీయంలో శివసేన పేర్కొంది. మహిళలపై అత్యాచారాలు, హత్య సంఘటనలు యూపీలో పెరుగుతున్నాయని శివ సేన పేర్కొంది . హత్రాస్ లో 19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలకు కారణం అయ్యింది . ఆమె మరణ వాంగ్మూలంలో బాధితురాలు తనపై అత్యాచారం జరిగిందని చెప్పింది .

 యూపీ ప్రభుత్వ, దేశంలోని ఎన్డీయే ప్రభుత్వ తీరుపై ఫైర్

యూపీ ప్రభుత్వ, దేశంలోని ఎన్డీయే ప్రభుత్వ తీరుపై ఫైర్

అయితే యుపి ప్రభుత్వం ఆమెపై అత్యాచారం జరగలేదని చెబుతోంది. ఆమె మరణ వాంగ్మూలానికి విలువ లేకుండా పోయిందని, అంతేకాదు యుపిలోని బాల్రాంపూర్‌లో సామూహిక అత్యాచారం జరిగిన సంఘటన కూడా వెలుగులోకి వచ్చింది అని శివసేన తెలిపింది. అయితే యూపీలో ఇంతా జరుగుతున్నా ఢిల్లీలోని పాలకులకు గాని, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి గానీ చీమ కుట్టినట్టు లేదని విమర్శించింది . అత్యాచారం జరగలేదని చెప్తున్న ప్రభుత్వ తీరుపై శివసేన మండిపడింది.

అత్యాచారం జరగలేదా ? దొంగచాటుగా అర్దరాత్రి దహన సంస్కారాలు దేనికి

అత్యాచారం జరగలేదా ? దొంగచాటుగా అర్దరాత్రి దహన సంస్కారాలు దేనికి

అత్యాచారమే జరగనప్పుడు ప్రతిపక్షాలు ఎందుకు ఆందోళనలు చేస్తున్నాయో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేసింది శివసేన . అత్యాచారం జరగకపోతే, పోలీసులు దొంగచాటుగా అర్దరాత్రి దహన సంస్కారాలు ఎందుకు చేశారో చెప్పాలని పేర్కొంది . గతంలో యోగి ఆదిత్యనాథ్ సెక్యూరిటీని ఉపసంహరించుకుంటేనే గతంలో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని యుపి ప్రభుత్వం మీద మండిపడ్డారు . ఇప్పుడు ఆయనే స్వయంగా ముఖ్యమంత్రిగా ఉండి మహిళల రక్షణ విషయంలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు .

 రాహుల్ ను అవమానించటం ప్రజాస్వామ్యంపై సామూహిక అత్యాచారం

రాహుల్ ను అవమానించటం ప్రజాస్వామ్యంపై సామూహిక అత్యాచారం

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని హత్రాస్ లో బాధిత కుటుంబాన్ని సందర్శించకుండా యుపి పోలీసులు ఆపారు. రాహుల్ గాంధీని కాలర్ పట్టుకుని క్రింద పడేశారు. దాడికి పాల్పడ్డారు . ఒక ప్రముఖ రాజకీయ పార్టీ నాయకుడిని ఈ విధంగా అవమానించడం ప్రజాస్వామ్యంపై సామూహిక అత్యాచారం, అని పేర్కొంది. హత్రాస్ బాధితుడి మృతదేహాన్ని పోలీసులు ఎవరినీ రానీకుండా , కుటుంబ సభ్యుల చివరి కోరిక కూడా తీర్చకుండా , ఆమె కుటుంబానికి మృత దేహం అప్పగించకుండా పెట్రోల్ పోసి కాల్చారు. ఈ అమానవీయ చర్య ఏ హిందూ సంప్రదాయంలో ఉందో చెప్పాలని శివసేన డిమాండ్ చేసింది.

  Bollywood లో AR Rahman కి వ్యతిరేకం గా ఓ గ్యాంగ్, Bollywood Mafia పై AR Rahman || Oneindia Telugu
   నాడు సాధువుల హత్యపై మాట్లాడిన యోగీ .. ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారో ?

  నాడు సాధువుల హత్యపై మాట్లాడిన యోగీ .. ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారో ?

  ఈ ఏడాది ఏప్రిల్‌లో మహారాష్ట్రలో పాల్ ఘర్ లో ఇద్దరు సాధువులను హతమార్చినప్పుడు, యోగి ఆదిత్యనాథ్ యొక్క ప్రకటనలను చూశామని, బిజెపి హిందుత్వ శంఖాన్ని పూరించిందని పేర్కొని, అయితే ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంది? అని ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన పార్టీ అడిగింది. గతంలో ఎన్నడూ దేశం ఇలాంటి నిస్సహాయ స్థితిలో లేదని శివసేన పేర్కొంది .యోగీ సర్కార్ పై, అలాగే దేశంలో అధికారంలో ఉన్న ఎన్డీయే సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది .

  English summary
  The Shiv Sena on Saturday hit out at the Yogi Adityanath government over the Hathras incident, saying that "jungle raj" prevails in Uttar Pradesh even as foundation stone for Ram temple has been laid at Ayodhya in the state. The ruling party in Maharashtra alleged that the recent incidents of atrocities against women in UP have failed to move the government in that state as well as the Centre.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X