Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

''ఆ సమాచారం మా వద్ద లేదు'',పొంతనలేని సమాధానాలిస్తోన్న ఆర్ బి ఐ

బ్యాంకుల్లో ఎంత మొత్తంలో నకిలీ కరెన్సీ డిపాజిట్ చేశారనే విషయం తమ వద్ద సమాచారం లేదని ఆర్ బి ఐ ప్రకటించింది.

న్యూఢిల్లీ: పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగా ఎంత మొత్తంలో నకిలీ నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్టు అయ్యాయనే సమాచారం తమ వద్ద లేదని రిజర్వ్ బ్యాంకు తేల్చి చెప్పింది.ముంబాయికి చెందిన అనిల్ అనే ఆర్ టి ఐ కార్యకర్త సమాచారం కొరకు ధరఖాస్తుచేయగా ఈ మేరకు ఆర్ బి ఐ ఈ విషయాన్ని వెల్లడించింది.

నల్ల ధనాన్ని నిర్మూలించేందుకుగాను పెద్ద నగదు నోట్లను రద్దుచేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొంది. గత ఏడాది నవంబర్ 8వ, తేదిన కేంద్రం ఈ నిర్ణయాన్ని వెల్లడించింది.

రద్దుచేసిన నగదు నోట్లను గత ఏడాది డిసెంబర్ 30వ, తేది వరకు డిపాజిట్ చేసే అవకాశం ఉన్నందున రద్దుచేసిన నగదును బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు.

బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన నగదులో ఏ మేరకు నకిలీ నగదు ఉందనే విషయమై తమ వద్ద సమాచారం లేదని ఆర్ బి ఐ అధికారులు చెబుతున్నారు.

 నకిలీ కరెన్సీ ఎంత డిపాజిట్ చేశారో తెలియదు

నకిలీ కరెన్సీ ఎంత డిపాజిట్ చేశారో తెలియదు

పెద్ద నగదు నోట్లను రద్దుచేసిన తర్వాత ఏ మేరకు నకిలీ కరెన్సీ బ్యాంకుల్లో డిపాజిట్ అయిందనే విషయం తమ వద్ద రికార్డులు లేవని ఆర్ బి ఐ చెబుతోంది.ఈ మేరకు ఆర్ టి ఐ కార్యకర్త ఒకరు ఈ మేరకు ఈ విషయమై ఆర్ బి ఐ ని సమాచారం అడిగారు. అయితే ఈ నకిలీ కరెన్సీ ఎంత మొత్తంలో బ్యాంకుల్లో డిపాజిట్ అయిందనే సమాచారం లేదని చెప్పింది ఆర్ బి ఐ.

ఆర్ బి ఐ పొంతనలేని సమాధానాలు

ఆర్ బి ఐ పొంతనలేని సమాధానాలు

పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత పలువురు ఆర్ టి ఐ కార్యకర్తలు సమాచారం కోసం ఆర్ బి ఐకి ధరఖాస్తులు చేశారు.అయితే ధరఖాస్తులు చేసుకొన్న ఆర్ టి ఐ కార్యకర్తలకు ఆర్ బి ఐ నుండి పొంతనలేని సమాధానాలు వచ్చాయి. మెజారిటీ ప్రశ్నలకు తమ వద్ద సమాధానం లేదంటూ దాటవేత వైఖరిని అవలంబిస్తోంది.మరో వైపు కొందరికైతే ఈ ప్రశ్నలకు సమాధానాలు చెబితే ప్రాణాలకు ముప్పు ఉందంటూ సమాచారం ఇచ్చారు.

ఆర్ బి ఐ వైఖరిపై అసంతృప్తి

ఆర్ బి ఐ వైఖరిపై అసంతృప్తి

ఆర్ బి ఐ వైఖరిపై పలు సంస్థలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేశాయి.రాజ్యసభ స్టాండింగ్ కౌన్సిల్, పార్లమెంట్ కమిటీలు కూడ ఆర్ బి ఐ తీరుపై బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేశాయి. అయితే ఆర్ బి ఐ వద్ద ఎలాంటి సమాచారం లేదని ఆ కమిటీలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి.

ఆర్ బి ఐ నుండి ఎలాంటి సమాచారం రాబట్టని ఆర్ టి ఐ కార్యకర్తలు

ఆర్ బి ఐ నుండి ఎలాంటి సమాచారం రాబట్టని ఆర్ టి ఐ కార్యకర్తలు

పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత చోటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలో ఆర్ బి ఐ నుండి సమాచారం కోసం ఆర్ టి ఐ కార్యకర్తలు ప్రయత్నించి విఫలమయ్యారు. ఆర్ టి ఐ కార్యకర్తలు పలు రకాలుగా ఆర్ బి ఐ ని ప్రశ్నించి విసిగిపోయారు.కాని , ఆర్ బి ఐ నుండి ఆశించిన మేర సమాచారాన్ని మాత్రం సేకరించలేకపోయారు.అయితే ఆర్ టి ఐ కార్యకర్తలు మాత్రం తమ పట్టువీడడం లేదు. ఆర్ బి ఐకి సమాచారం కోసం ధరఖాస్తులు చేస్తూనే ఉన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+