వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహారాష్ట్రలో కరోనా ఉధృతి: మాస్కులు మస్ట్, మార్చి 31 వరకు కఠిన నిబంధనలు

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్రలో కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం 15,051 కరోనా కేసులు నమోదు కాగా, 10,671 మంది కోలుకున్నారు. మరో 48 మంది కరోనాతో మరణించారు. మహారాష్ట్రలో 1,30,547 యాక్టివ్ కేసులున్నాయి.

ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారు కొత్తగా మార్గదర్శకాలను విడుదల చేసింది.
మార్చి 31 వరకు అన్ని కార్యాలయాలు 50 శాతం హాజరుతోనే కార్యకలాపాలు నిర్వహించాలి. కొత్త మార్గదర్శకాలను ఉల్లంఘించకుండా వర్క్ ఫ్రం హోం కార్యకలాపాలను నిర్వహించుకోవాలని స్పస్టం చేసింది.

No social gatherings, masks mandatory: Maharashtra re-imposes Corona restrictions till March 31

సోమవారం జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. సినిమా హాళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు 50 శాతం కెపాసిటీతోనే కార్యకలాపాలు కొనసాగించాలని తెలిపింది. మాస్కులు ధరించనివారిని లోనికి అనుమతించవద్దని తేల్చి చెప్పింది. బాడీ టెంపరేచర్ కొలిచే యంత్రాలు, హ్యాండ్ శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని పేర్కొంది.

ఈ నిబంధనలను ఉల్లంఘించిన సినిమా హాళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లను కేంద్ర ప్రభుత్వం కోవిడ్ 19 విపత్తు కింద మూసివేస్తామన్నారు. అంతేగాక, జరిమానాలు కూడా విధిస్తామని తెలిపింది. ఇక షాపింగ్ మాల్స్ కూడా మాస్కులు, హ్యాండ్ శానిటైజర్లు ఉపయోగం తప్పనిసరి అని పేర్కొంది. కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకోవాలని ప్రభుత్వం తేల్చి చెప్పింది.

ఇక భారీ మొత్తంలో జనం గుమిగూడటం, వివాహాలు, అంత్యక్రియలు, ఇతర సాంస్కృతిక, రాజకీయ, మతపరమైన కార్యక్రమాలు కూడా తాజా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించుకోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఇలాంటి కార్యక్రమాల్లో 50 మందికి మించకూడదని తేల్చి చెప్పింది. అంత్యక్రియలకు 20 మందికంటే ఎక్కువ హాజరుకాకూడదని తెలిపింది. ఎవరైనా హోం ఐసోలేషన్‌లో ప్రభుత్వ అధికారులకు, వైద్యులకు సమాచారం ఇవ్వాలని తెలిపింది.

English summary
No social gatherings, masks mandatory: Maharashtra re-imposes Corona restrictions till March 31.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X