ఆ ప్రచారంలో నిజం లేదు: జైల్లో గుర్మీత్‌ను ఎలా ట్రీట్ చేస్తున్నారంటే?

గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు జైల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించడం లేదని డీజీ కేపీ సింగ్ తెలిపారు.

పంచకుల: దేశంలో మరే బాబాకు లేనంత ఫాలోయింగ్ సంపాదించుకున్న డేరా బాబా ప్రస్తుతం కటకటాలపాలైన సంగతి తెలిసిందే. బాబాగా అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడిపే గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు జైల్లో మాత్రం అలాంటి సదుపాయాలేమి లభించడం లేదు.

ఈ విషయాన్ని పంచకుల డీజీ(జైళ్ల) కేపీ సింగ్‌ వెల్లడించారు. గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు జైల్లో వీవీఐపీ సేవలు అందుతాయన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఆయనను సాధారణ ఖైదీలాగే చూస్తున్నామన్నారు. ఈ విషయంలో నిరాధారపూరితమైన వార్తలకు ప్రాధాన్యం ఇవ్వవద్దని మీడియాను కోరారు.

 no special treatment for gurmit ram rahim singh in rohtak jail

ప్రస్తుతం డేరా బాబాను రోహ్‌తక్‌లోని సోనారియా జిల్లా జైల్లో ఉంచామని, మిగతా ఖైదీల్లాగే ఆయనను కూడా సాధారణంగానే ట్రీట్ చేస్తున్నామని కేపీ సింగ్‌ పేర్కొన్నారు. బాబా సెల్‌లో ఎలాంటి లగ్జరీ సదుపాయం కల్పించలేదన్నారు. హర్యానా జైలు నియమాల ప్రకారం.. ఇద్దరు ఖైదీలతో ఆయనపై నిఘా పెట్టినట్లు తెలిపారు.

కాగా, 2002లో ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో గుర్మీత్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. దీంతో కోర్టు నుంచి ఆయనను రోహ్‌తక్‌ జైలుకు తరలించారు. ఈ నెల 28న గుర్మీత్‌కు శిక్ష ఖరారు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు జైల్లో ప్రత్యేక ట్రీట్‌మెంట్ లభిస్తుందన్న ప్రచారం జరిగింది. డీజీ స్పందనతో అవన్ని కట్టు కథలే అని తేలిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+