వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏడాదికి రూ. 10 లక్షలుంటే ఎల్‌పిజిపై సబ్సిడీ కట్

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వార్షికాదాయం రూ. 10 లక్షల రూపాయలు ఉండి పన్ను చెల్లించే వినియోగదారులకు వంట గ్యాస్‌పై సబ్సిడీని ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల నుంచే ఈ సబ్సిడీని ఎత్తేయాలని ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకుది.

ప్రస్తుతం 14.2 కిలోల చొప్పున గ్యాస్ ఉండే 12 గ్యాస్ సిలిండర్లపై అందరికీ సబ్సిడీ అమలు చేస్తూ ఒక్కో సిలిండర్‌ను రూ.419.26లకే అందిస్తున్నారు. దాని మార్కెట్ ధర రూ.608 ఉంటుంది. ఎల్పీడిపై సిబ్సిడీని వదులుకోవాలని సంపన్నవర్గాలకు ఆయిల్ మంత్రిత్వ శాఖ కోరింది.

No subsidised LPG for tax payers earning over Rs 10 lakh a year

ఇప్పటి వరకు 57.5 లక్ష ఎల్పిజీ వినియోగదారులు, దాదాపు 15 కోట్ల కస్టమర్లు సబ్సిడీని వదులుకున్నారు. గత ఏడాది ఆదాయాన్ని లెక్కలోకి తీసుకుని భార్యాభర్తల్లో ఏ ఒక్కరికైనా పది లక్షలకు మించి వార్షికాదాయం ఉంటే సబ్సిడీని రద్దు చేస్తారు.

2016 జనవరి నుంచి బుక్ చేసే వినియోగదారుల నుంచి తొలుత సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుంటారు. 2014-15లో ప్రభుత్వంపై సబ్సిడీ భారం రూ.40,551 కోట్లు పడింది. ఎంత మంది వినియోగదారుల వార్షికాదాయం రూ. 10 లక్షలకు మించి ఉందనే అంచనాలు మాత్రం ఇప్పటి వరకు లేవు.

English summary
Tax payers with annual income of more than Rs 10 lakh will not get subsidised cooking gas (LPG) from next month as the government on Monday decided to limit supply of under-priced fuel to cut subsidies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X