బంగారంపై కేంద్రంపై దృష్టి: ఇలా ఉంటే పన్ను లేదు, కానీ

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఐటీ దాడుల్లో బంగారం పట్టుబడితే ప్రతి గ్రాముకు లెక్క చూపించవలసి ఉంటుంది. వివాహిత వద్ద 500 గ్రాముల బంగారం, అవివాహితుల వద్ద 250 గ్రాముల వరకు బంగారం ఉండవచ్చు. ఇందుకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ గురువారం వివరాలు వెల్లడించింది.

పురుషుల వద్ద వంద గ్రాముల బంగారం ఉండవచ్చు. ఇప్పటికే వెల్లడించిన డబ్బుతో బంగారం కొంటే పన్ను లేదు. వారసత్వంగా వచ్చిన బంగారం పైన కూడా పన్ను లేదు. పన్ను మినహాయింపు ఉన్న సొమ్ముతో బంగారం కొనుక్కోవచ్చు.

No tax on jewellery/gold purchased out of disclosed income.

అంతా దుష్ప్రచారం: జైట్లీ

- నగదు మార్పిడిలో భాగంగా కొనుగోలు చేసిన బంగారంపై మాత్రమే పన్ను విధిస్తామని జైట్లీ స్పష్టం చేశారు.
- వివాహిత 500 గ్రాములు, అవివాహిత 250 గ్రాములు, పురుషులు 100 గ్రాముల బంగారం కలిగి ఉండవచ్చు.
- వారసత్వంగా వచ్చిన, వ్యవసాయ ఆదాయం ద్వారా కొనుగులు చేసిన, లెక్కచూపిన ఆదాయం ద్వారా కొనుగోలు చేసిన బంగారంపై పన్ను లేదు.
- బంగారు నగల పరిమితిపై కొత్తగా ఎలాంటి నిబంధనలు విధించలేదని జైట్లీ చెప్పారు.
- చట్ట సవరణ బిల్లులో నగల జప్తుపై ఎలాంటి కొత్త నిబంధనలు లేవన్నారు. ఈ నిబంధనలన్నీ గతంలో ఉన్నవేనని చెప్పారు.
- బంగారు ఆభరణాలపై జరుగుతున్న దుష్ప్రచారం అవాస్తవమని, పరిమితికి మించి ఉన్న ఆభరణాల పైనే ఐటీ అధికారులు వివరణ అడుగుతారన్నారు.

ఆర్నెల్ల కనిష్ఠానికి బంగారం ధర

బంగారం ధర పతనం కొనసాగుతోంది. దేశ రాజధానిలో గురువారం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రూ.350 తగ్గి రూ.29,000లకు చేరింది. వెండి ధర సైతం తగ్గింది. కిలో వెండి రూ.735 తగ్గి.. 40,700లకు చేరింది. నాణేల తయారీదారులు, పరిశ్రమల నుంచి కొనుగోళ్లు మందగించడం వెండి ధర తగ్గుదలకు కారణమైంది.

అంతర్జాతీయ పరిణామాలు, డాలర్‌ బలహీనం, అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంకు వడ్డీ రేట్లు పెంచగలదన్న భయాలు బంగారం, వెండి ధరల తగ్గుదలకు మూలం అయ్యాయని బులియన్‌ ట్రేడింగ్‌ వర్గాలు భావిస్తున్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
No tax on jewellery/gold purchased out of disclosed income.
Please Wait while comments are loading...