ఇంట్లో టాయిలెట్ లేకుంటే ఎన్నికల్లో టిక్కెట్‌కు నో: నితీష్
పాట్నా: ఇంట్లో టాయిలెట్లు లేకుంటే ఎన్నికల్లో పోటీకి చేయడానికి అర్హులు కారని బీహార్ ముఖ్యమంత్రి, జెడి(యు) నేత నితీష్ కుమార్ మంగళవారం అన్నారు. నవంబర్ 19న ప్రపంచ టాయిలెట్ దినం సందర్భంగా ఆయన బీహార్ రాజధాని పాట్నాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇంట్లో టాయిలెట్ లేని వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో అర్హులు కాదన్నారు. ఇందుకు సంబంధించి పంచాయతీ రాజ్ యాక్టును త్వరలో తమ ప్రభుత్వం తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుందన్నారు.

కాగా, కేంద్ర ప్రభుత్వం ప్లాన్ ప్రకారం... 1.11 కోట్ల టాయిలెట్లను నిర్మించాల్సి ఉంది. అయితే బీహార్‌లో రెండు కోట్ల కుటుంబాలకు టాయిలెట్లు లేవు అని నితీష్ కుమార్ చెప్పారు.
రాష్ట్రంలో ప్రతి ఒక్కరు టాయిలెట్లు నిర్మించుకోవాలని సూచించారు. ప్రభుత్వంతో మమేకమై అందరు వాటిని నిర్మించుకోవాలని నితీష్ సూచించారు. కాగా పాట్నాలో ఈ కార్యక్రమాన్ని గ్రామీణ అభివృద్ధి, ప్రజా ఆరోగ్య ఇంజనీరింగ్ డిపార్టుమెంట్ ఆధ్వర్యంలో జరిగింది.












Click it and Unblock the Notifications