• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆగస్టు 15నాటికి కరోనా వ్యాక్సిన్.. ఐసీఎంఆర్ డెడ్‌లైన్‌తో కేంద్రం విభేదం.. 2021దాకా రాబోదని క్లారిటీ.

|

''కరోనా వైరస్ కట్టడికి హైదరాబాద్ సంస్థ భారత్‌ బయోటెక్‌ రూపొందించిన 'కోవ్యాక్సిన్‌' ఆగస్టు 15 నాటికి మార్కెట్లో అందుబాటులోకి వస్తుంది..'' అంటూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) చేసిన ప్రకటనతో కేంద్ర ప్రభుత్వం విభేదించింది. ఐసీఎంఆర్ డెడ్‌లైన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ఎట్టకేలకు స్పందించింది. ఇండియాలోనేకాదు, ప్రపంచంలో ఎక్కడా 2021దాకా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశమే లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదివారం సైన్స్ శాఖ కీలక ప్రకటన చేసింది.

ప్రగతి భవన్‌లో కరోనా.. కేసీఆర్‌ కూ వైరస్ సోకిదంటూ ప్రచారం.. తెలంగాణలో 8రెట్లు పెరిగిన కేసులు..

2021లోపు రానేరాదు..

2021లోపు రానేరాదు..

‘‘పుణెలోని వైరాల‌జీ నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ (ఎన్‌ఐవి), హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీఎస్ఐఆర్) సంస్థల వివరణ ప్రకారం.. ఇండియాలో మొత్తం ఆరు ఫార్మా కంపెనీలు కరోనా వ్యాక్సిన్ కోసం పరిశోధనలు చేస్తున్నాయి. అందులో కొవ్యాక్సిన్(COVAXIN), జైకొవ్-డి (ZyCov-D) వ్యాక్సిన్లు హ్యూమన్ ట్రయల్స్ దశకు చేరుకున్నాయి. అలాగే ప్రపంచ వ్యాప్తంగా వివిధ కంపెనీలు రూపొందించిన 140 వ్యాక్సిన్లలో.. కేవలం 11 మాత్రమే క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయి. వీటిలో ఏ ఒక్కటి కూడా 2021లోపు జనసామాన్యానికి అందుబాటులోకి వచ్చే అవకాశమే లేదు'' అని సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ప్రకటనలో పేర్కొన్నారు.

కరోనా విలయం: భారత్ మరో రికార్డు.. భారీగా మరణాలు.. ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్ సెంటర్..

రాజకీయ దుమారం..

రాజకీయ దుమారం..

ఆగస్టు 15న ప్రధాని మోదీ ఎర్రకోటపై చేయబోయే ప్రసంగంలో ఘనంగా చెప్పుకునేందుకు కరోనా వ్యాక్సిన్ తయారీపై డెడ్ లైన్లు విధిస్తున్నారని, ఇది బీజేపీ మార్కు రాజకీయాలకు పరాకాష్ట అని విపక్షాలు ఆరోపించాయి. అయితే, దేశంలో నెలకొన్న పరిస్థితులు, ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే.. వ్యాక్సిన్‌ పరీక్షల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించామే తప్ప, ఇందులో రాజకీయ ఉద్దేశాలకు తావులేదని ఐసీఎంఆర్ వివరణ ఇచ్చుకుంది. అయినాసరే విమర్శలు ఆగకపోవడంతో చివరికి కేంద్ర ప్రభుత్వమే దీనిపై ప్రకటన చేయాల్సి వచ్చింది.

ఇంకా కనీసం 18 నెలలు..

ఇంకా కనీసం 18 నెలలు..

కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడానికి ఇంకా కనీసం 18 నెలల సమయమైనా పడుతుందని ఐసీఎంఆర్‌ మాజీ చీఫ్‌ ఎన్కే గంగూలీ అన్నారు. హ్యూమన్ ట్రయల్స్ కు అనుమతి లభించిన తర్వాత మొదటి దశలో ఒకే వయసున్నవారిపై టెస్టులు చేస్తారని, అవి సక్సెస్ అయితే.. రెండో దశలో 600 నుంచి 700 మందిపై ప్రయోగాలు చేస్తారని, ఆ తర్వాతే మూడో దశకు అనుమతి లభిస్తుందని గంగూలీ తెలిపారు. చివరిదైన నాలుగో దశలో ఇంకా ఎక్కువ మందిపై ప్రయోగాలు చేయాల్సి ఉంటుందని, ఎంత కాదనుకున్నా అన్ని దశలు విజయవంతంగా దాటడానికి కనీసం 18 నెలల సమయం పడుతుందని ఆయన వివరించారు.

English summary
The Ministry of Science and Technology today said that none of the Covid-199 vaccines may be ready for mass use before 2021. The statement is in contrast to ICMR's claim that said it "envisages to launch the vaccine for public health use latest by August 15, 2020 after completion of all clinical trials"
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more