వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ రెండు కీలక ఘటనలపై ఒక్క మాట కూడా లేదు: రాష్ట్రపతి ప్రసంగంపై కాంగ్రెస్ నేత తివారీ ఫైర్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాలకు ముందు పార్లమెంటులో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సోమవారం ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ప్రసంగంపై ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారీ కూడా ఈ అంశంపై స్పందించారు.

మనీష్ తివారీ మాట్లాడుతూ.. "నాగాలాండ్‌లో పౌరుల కాల్చివేత, కోవిడ్ -19 రెండవ వేవ్ సమయంలో మరణించిన వారి గురించి రాష్ట్రపతి ఏమీ చెప్పలేదు' అని అన్నారు.
'రాష్ట్రపతి ప్రసంగంలో జమ్మూకాశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరించడం గురించి ఏమీ లేదు. ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబాన్ స్వాధీనం చేసుకోవడం, భారతదేశంపై దాని ఉగ్రవాద ప్రభావాల గురించి కూడా ఆయన ప్రసంగంలో ప్రస్తావించబడలేదు' అని మనీష్ తివారీ వ్యాఖ్యానించారు.

 No word on Nagaland massacre, Covid 19 deaths: Manish Tewari on Presidents address

కాగా, సోమవారం ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేసిన ప్రసంగంతో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి కోవింద్ తన ప్రసంగంలో స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పించారు. నేతాజీ 125వ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వం ఆయనను సముచితంగా గౌరవించిందని కోవింద్ అన్నారు.

'కోవిడ్ సమయంలో భారతదేశం ఒక బృందంగా పనిచేసింది. భారతదేశం టీకా కార్యక్రమం ప్రపంచ రికార్డులను సృష్టించింది. 90% మంది సీనియర్ సిటిజన్లు కనీసం ఒక డోస్ వ్యాక్సిన్‌ని అందుకున్నారు' అని రాష్ట్రపతి కోవింద్ తెలిపారు. ఎవరూ ఆకలితో నిద్రపోకుండా ఉండేలా ప్రభుత్వం పథకాలపై పనిచేస్తోందని ఆయన అన్నారు.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం 2021-22 ఆర్థిక సర్వేను పార్లమెంటులో సమర్పించారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి (ఏప్రిల్ 2022 నుంచి మార్చి 2023 వరకు) ఆర్థిక నివేదికలు, పన్ను ప్రతిపాదనలతో తన నాల్గవ వరుస కేంద్ర బడ్జెట్‌ను మంగళవారం సమర్పించనున్నారు. బడ్జెట్ సెషన్ మొదటి భాగం జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరుగుతుంది.

English summary
No word on Nagaland massacre, Covid 19 deaths: Manish Tewari on President's address.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X