బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వెలకట్టలేని సేవలందించారు: యడ్యూరప్పపై ప్రధాని మోడీ ప్రశంసలు, బొమ్మైకి అభినందనలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప సేవలను ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. భారతీయ జనతా పార్టీని విస్తరించడంలో, కర్ణాటక అభివృద్దికి ఆయన చేసిన కృషిని వర్ణించడానికి పదాలు సరిపోవని అన్నారు. దశాబ్దాలుగా కష్టనష్టాలకోర్చి.. ఆయన రాష్ట్ర ప్రజలతో మమేకమయ్యారనన్నారు.

ప్రజా సంక్షేమం పట్ల ఆయనుకున్న నిబద్ధత వెలకట్టలేనిదని యడ్యూరప్పపి ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. అలాగే, కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన బసవరాజ్ బొమ్మైకి ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. బుదవారం కర్ణాటక ముఖ్యమంత్రిగా బసవరాజ్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.

 No words will ever do justice to the monumental contribution of BS Yediyurappa: PM Modi, congratulations to basavaraj bommai

బసవరాజ్ బొమ్మైకి ఉన్న అపార అనుభవం రాష్ట్రాన్ని నడిపించడంలో సహకరిస్తుందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బసవరాజ్ బొమ్మైకు అభినందనలు. ఆయన అపారమైన పాలనానుభవం కలిగిన వ్యక్తి. రాష్ట్రా అభివృద్ధికి మన ప్రభుత్వం చేసిన కృషిని ఆయన ముందుకు తీసుకెళ్లారని ఆశిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీ చెప్పారు.

కాగా, బసవరాజ్ బొమ్మై ఎంపికలో యడ్యూరప్ప కీలక పాత్ర పోషించారు. ఆయన అత్యంత సన్నిహితుల్లో ఒకరైన బొమ్మై నాయకత్వాన్ని దాదాపు అందరూ ఆమోదించారు. దీంతో బొమ్మై కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యారు. కర్ణాటకలో బలియమైన లింగాయత్ వర్గానికి చెందినవారే కావడం ఆయనకు కలిసొచ్చే అంశంగా మారింది. త్వరలోనే బసవరాజ్ తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన బొమ్మైకి బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు శుబాకంక్షలు తెలిపారు.

English summary
No words will ever do justice to the monumental contribution of BS Yediyurappa: PM Modi, congratulations to basavaraj bommai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X