ఫ్యాషన్ డిజైనర్ అదృశ్యం: ఆమె కారు దొరికింది
న్యఢిల్లీ: సోమవారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయిన మహిళా ఫ్యాషన్ డిజైనర్‌కి చెందిన కారు దొరికింది. అయితే, ఆమె ఆచూకీ ఇంకా తెలియలేదు. నోయిడాకు చెందిన శిప్రా మాలిక్ అనే ఫ్యాషన్ డిజైనర్ ఢిల్లీలో బొటిక్ నిర్వహిస్తోంది.
మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సాయం కోసం ఆమె పోలీసులకు ఫోన్ చేసింది. ఆ తర్వాత ఉన్నట్టుండి ఆమె అదృశ్యమైంది. ఈ నేపథ్యంలో పోలీసులు శిప్రా ఆచూకీ కోసం గాలిస్తుండగా ఆమె తెల్ల స్విఫ్ట్ కారు నోయిడాలో లభ్యమైంది.
ఆ కారు ఆమె నివాసానికి 500 మీటర్ల దూరంలోనే ఉందని పోలీసులు చెప్పారు. కాగా, అందులో కారు తాళాలు కూడా ఉన్నాయని పోలీసులు తెలిపారు. శిప్రా భర్త చేతన్ మాలిక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని చెప్పారు.

ఆమె మొబైల్ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వస్తోందని తెలిపారు. శిప్రా అదృశ్యమయ్యాక ఎలాంటి బెదిరింపు కాల్స్ రాలేదని త్వరలో యువతి ఆచూకీ తెలుసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.
కాగా, ఇటీవల స్నాప్‌డీ సంస్థకు చెందిన ఓ మహిళా ఉద్యోగిని అదృశ్యమై 40గంటల తర్వాత క్షేమంగా ఇంటికి చేరుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ 29ఏళ్ల ఫ్యాషన్ డిజైనర్ అదృశ్యం కలకలం రేపుతోంది.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications