టీవీ సీరియల్ చూసి ఫ్యాషన్ డిజైనర్ కిడ్నాప్ డ్రామా
న్యూఢిల్లీ: కొన్ని రోజుల క్రితం అనుమానాస్పదస్థితిలో మాయం అయిన నోయిడాకు చెందిన ఫ్యాషన్ డిజైనర్ పిప్రా మాలిక్ ప్రత్యక్షం అయ్యారు. ఆమె సురక్షితంగా ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను కలుసుకున్నారని పోలీసులు అన్నారు. అయితే పిప్రా మాలిక్ కిడ్నాప్ కాలేదని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.
అయితే ఆమె హఠాత్తుగా ఇంటి నుంచి మాయం అయ్యి కిడ్నాప్ చేశారని చెప్పడం వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి అని అని పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. టీవీ సిరియల్ లో వస్తున్న క్త్రైమ్ పెట్రోల్ అనే సీరియల్ చూసి పిప్రా మాలిక్ ఈ కిడ్నాప్ డ్రమా ఆడిందని, ఆమెను ఎవరు కిడ్నాప్ చెయ్యలేదని పోలీసులు అంటున్నారు.

ఇప్పటికే పిప్రా మాలిక్ వ్యవహాకంపై ప్రాథమిక విచారణ జరిగిందని పోలీసు అధికారులు అంటున్నారు. అసలు పిప్రా మాలిక్ కిడ్నాప్ కాలేదని చెబుతున్నారు. ఇంట్లో సమస్యలు, కుటుంబ సభ్యుల పట్ల విరక్తితో ఫిబ్రవరి 29వ తేదిన పిప్రా మాలిక్ ఇంటి నుంచి పారిపోయారని పోలీసులు అంటున్నారు.
తరువాత పలు ప్రదేశాల్లో ఆమె సంచరించారని చెప్పారు. హర్యానాలోని ఓ ఆశ్రమంలో మూడు రోజుల పాటు ఉన్నారని తమ విచారణలో వెలుగు చూసిందని చెప్పారు. ఆమె మొదట తనను ముగ్గురు కిడ్నాప్ చేసి నోయిడా తీసుకు వెళ్లారని పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు.
అయితే వెంటనే ఆమె మాట మార్చి తప్పుడు సమాచారం ఇవ్వడం మొదలు పెట్టారని పోలీసు అధికారులు అంటున్నారు. అసలు పిప్రా మాలిక్ కిడ్నాప్ కు గురి కాలేదని, ఆమె మానసిక పరిస్థితిని తెలుసుకోవడానికి వైద్య పరిక్షలు చేయిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications