నాన్ సబ్సిడీ సిలిండర్ల ధరలు పెంపు: ఎంతంటే?
న్యూఢిల్లీ: నాన్ సబ్సిడీ(రాయితీ లేని) వంట గ్యాస్ సిలిండర్ల ధరలు మరోసారి పెరిగాయి. సిలిండర్‌పై రూ. 15.50 చొప్పున ధర పెరిగింది. ప్రస్తుతం వినియోగదారులకు ప్రతి ఏటా 12 ఎల్పీజీ సిలిండర్లను రాయితీపై ఇస్తున్న విషయం తెలిసిందే.
ఈ పరిమితికి మించి వినియోగించుకునే సిలిండర్లు పెరిగిన ధర చెల్లించాల్సి ఉంటుంది. ఆగస్టు నెలలో సిలిండర్ ధర రూ. 574.5 ఉండగా, సెప్టెంబర్ 1న ప్రకటించిన ధర రూ. 590కి పెరిగింది.

లీటర్ సబ్సిడీ కిరోసిన్ ధరపై 25 పైసలు పెరిగింది. మరో వైపు అంతర్జాతీయ చమురు ధరల తగ్గడంతో విమానాలకు వాడే ఇంధనం (ఏటీఎఫ్) ధర శాతం తగ్గింది. ఆయిల్ కంపెనీలు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ప్రతి నెలా ఒకటో తేదీన ఈ ఉత్పత్తుల ధరలు సవరిస్తుంటాయి.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకారం.. నాన్ సిబ్సిడీ సిలిండర్ ధరలు సెప్టెంబర్ ఒకటి నుంచి ఈ నగరాల్లో ఇలా ఉండనున్నాయి. ఢిల్లీలో రూ. 590, కోల్‌కతా రూ. 616.5, ముంబైలో 562, చెన్నైలో రూ. 606.5గా ఉంది.












Click it and Unblock the Notifications