26 వరకు మోడీనే, ‘విశ్వగురువు’గా భారత్: 1555‌లోనే చెప్పిన నోస్ట్రడామస్

న్యూయార్క్/న్యూఢిల్లీ: అవును, మీరు చదివింది నిజమే. ప్రధాని నరేంద్ర మోడీ కాలంలోనే భారత్.. ప్రపంచానికే గురువుగా మారుతుందని ఫ్రెంచ్ కాలజ్ఞాని నోస్ట్రడామస్ జోస్యం చెప్పారట. ఈ విషయాన్ని 'అమేజింగ్ ఫ్యాక్ట్స్' పేరిట కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు.

సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడా ఇది సంభవమేనని అన్నారు. ఆయన ఏమని పోస్టు చేశారంటే...

Nostradamus predicted Narendra Modi era, India's rise as a 'global master'!

ప్రస్తుత లోక్ సభలో వివిధ పార్టీల సంఖ్యాబలం:

బీజేపీ - 283 సీట్లు; 2+8+3 = 13
ఎన్డీయే - 337 సీట్లు; 3+3+7 = 13
యూపీఏ - 58 సీట్లు; 5+8 = 13
ఇతరులు - 148 సీట్లు; 1+4+8 = 13.

"దాదాపు 450 ఏళ్ల క్రితమే నోస్ట్రడామస్ ఈ విషయాన్ని అంచనా వేశాడు. 2014 నుంచి 2026 వరకూ ఓ వ్యక్తి ఇండియాకు నాయకత్వం వహిస్తారు. తొలుత ఆయన్ను ద్వేషించిన ప్రజలే, ఆపై ఆయన మీద ఎంతో ప్రేమను చూపుతారు. ఆయన దేశ దశ, దిశలను మారుస్తారు' నోస్ట్రడామస్ చెప్పినట్టు రిజిజు వ్యాఖ్యానించారు.

అంతేగాక, 'ఓ మధ్య వయస్కుడు ఇండియాకు బంగారు భవిష్యత్తును దగ్గర చేయడంతో పాటు మొత్తం ప్రపంచానికే మార్గనిర్దేశకుడవుతారు. ఆయన నాయకత్వంలో భారత్ గ్లోబల్ మాస్టర్(విశ్వగురువు)గా ఎదుగుతుంది. ఎన్నో దేశాలు భారత గొడుగు కింద ఉంటాయి' అని నోస్ట్రడామస్ చెప్పినట్టు కేంద్రమంత్రి రిజిజు వ్యాఖ్యానించారు.

AMAZING FACTS !!!In Current of Lok SabhaBJP - 283 Seats 2+8+3 = 13NDA - 337 Seats 3+3+7 = 13UPA - 58 Seats ...

Posted by Kiren Rijiju onThursday, March 17, 2016

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+