మాకు ఈరోజేం ముఖ్యమైనది కాదు: బీజేపీపై కుమారస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీలో శనివారం సాయంత్రం 4గంటలకు సీఎం యడ్యూరప్ప బలనిరూపణ పరీక్ష ఎదుర్కొనున్న నేపథ్యంలో జేడీఎస్ నేత, కాంగ్రెస్-జేడీఎస్ సీఎం అభ్యర్థి హెచ్‌డీ కుమారస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు తమకు అంత ముఖ్యమైన రోజేం కాదని అన్నారు.
తమకు ముఖ్యమైన రోజులు భవిష్యత్‌లో వస్తాయని కుమారస్వామి చెప్పారు. అంతేగాక, బలనిరూపణ పరీక్ష నేపథ్యంలో శనివారం సాయంత్రం 4గంటల వరకు తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తూనే ఉంటుందని అన్నారు.

అయితే, తమ ఎమ్మెల్యేలంతా తమతోనే ఉన్నారని కుమారస్వామి స్పష్టం చేశారు. ఏ ఒక్కరు కూడా వేరే పార్టీవైపు వెళ్లడం లేదని చెప్పారు. తాను, కాంగ్రెస్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య కలిసి ముందుకు సాగుతున్నామని కుమారస్వామి తెలిపారు.
బలనిరూపణలో యడ్యూరప్పకు ఓటమి ఖాయమని తేల్చిచెప్పారు. యడ్యూరప్ప సర్కారు బలనిరూపణ నేపథ్యంలో ప్రొటెం స్పీకర్ ఎలాంటి తప్పులు చేయడానికి ఆస్కారమే లేదని పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో శనివారం సాయంత్రం 4గంటలకు యడ్యూరప్ప ప్రభుత్వం బల నిరూపణ పరీక్ష ఎదుర్కొనుంది. తమకు మద్దతుగా 120మంది ఎమ్మెల్యేలు ఉన్నారని బీజేపీ చెబుతుండటం గమనార్హం. ఇది ఇలా ఉంటే, సాయంత్రం 5గంటల తర్వాత సంబరాలకు సిద్ధంగా ఉండాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు సీఎం యడ్యూరప్ప.
-
ఏపీ, తెలంగాణాను కలిపే ఆ జాతీయ రహదారిపై 15 రోజులపాటు నో టోల్ ఫీ -
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
కర్ణాటక టూర్ వెళ్లొద్దామా..? తక్కువ ధరకే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ లో ఎంజాయ్..! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే












Click it and Unblock the Notifications