'భారతరత్న' రగడ: అర్హుడిని కాను: అమితాబ్
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నకు తాను అర్హుడిని కాదంటూ బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ అన్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో స్పందించారు. తనకు భారతరత్న ఇవ్వాలన్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ డిమాండ్‌తో అమితాబ్ బచ్చన్ విబేధించారు.
'మమతా జీ.. భారతరత్న అవార్డుకు నేను అర్హుడిని కాదు. దేశం నాకు అత్యున్నత గౌరవాన్ని ఇచ్చింది' అని అమితాబ్ ట్వీట్ చేశారు. అమితాబ్ బచ్చన్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి గతంలో పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులను స్వీకరించిన విషయం తెలిసిందే.

తాజాగా అమితాబ్ బచ్చన్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ, బాలీవుడ్ లెజెండ్ దిలీప్ కుమార్‌లకు కూడా పద్మవిభూషణ్ ప్రకటించింది. దేశ అత్యున్నత పురస్కారం 'భారతరత్న'కు బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ అన్ని విధాల అర్హుడని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఆయనకు పద్మవిభూషణ్ సరిపోదన్నారు.
"తన సమకాలికుల మధ్య అమితాబ్ బచ్చన్ లెజెండ్. పద్మవిభూషణ్ సరిపోదు. తనకున్న హబోదాకు ఆయనకు 'భారతరత్న'కు అర్హులు" అని పేర్కొన్నారు. తన వ్యాఖ్యలతో 'బిగ్ బి' అమితాబ్ కు దేశ అత్యున్నత పురస్కారం ఇవ్వాలంటూ ఆమె భారత ప్రభుత్వానికి పరోక్షంగా డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications