అపోలో ఆసుపత్రిలో జయలలితను మంత్రులు అందరూ చూశారు: బాంబు పేల్చిన మంత్రి !

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి మరణంపై సొంత పార్టీలోని నాయకులు, తమిళనాడు ప్రభుత్వ మంత్రులు రోజుకో రకంగా మాట్లాడుతూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు. తాజాగా తమిళనాడు మంత్రి, అన్నాడీఎంకే పార్టీ సీనియర్

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి మరణంపై సొంత పార్టీలోని నాయకులు, తమిళనాడు ప్రభుత్వ మంత్రులు రోజుకో రకంగా మాట్లాడుతూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు. తాజాగా తమిళనాడు మంత్రి, అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నాయకుడు సెల్లూరు రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.

చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో అమ్మ జయలలిత చికిత్స పొందుతున్న సమయంలో తనతో పాటు మంత్రులు అందరూ చూశారని, తాను కూడా అనేక సార్లు చూశానని మంగళవారం మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. సాటి మంత్రి దిండుగల్ శ్రీనివాసన్ ఎందుకు అలా మాట్లాడారో అర్థం కావడం లేదని సెల్లూరు రాజు మీడియా ముందు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

 Not only myself all the ministers saw Jayalalitha in the hospital Sellur Raju

జయలలిత మరణంపై విచారణ కమిషన్ దర్యాప్తు మొదలు పెట్టిందని, ఇలాంటి సమయంలో ఆసుపత్రిలో అమ్మను చూశామా ? లేదా ? అనే విషయంపై తాను ఏమీ మాట్లాడనని తమిళనాడుకు చెందిన మరో సీనియర్ మంత్రి ఆర్ బి. ఉదయ్ కుమార్ మీడియాకు చెప్పారు. తమిళనాడు ప్రభుత్వంలో అధికారంలో ఉన్న మంత్రులు జయలలిత మరణం విషయంలో ఒక్కొక్కరు ఒకో రకంగా మీడియా ముందు మాట్లాడటంతో తమిళనాడు ప్రజలు, అమ్మ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+