భ‌క్తుల‌కు గ‌మ‌నిక : కేదార్​నాథ్ ఆలయం త‌లుపులు మూసివేత‌..

ఉత్తరాఖండ్‌లో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదారీశ్వరుడి ఆలయ తలుపులు మూసివేశారు. కేదార్‌నాథ్ అత్యధికంగా సందర్శించే మతపరమైన ప్రదేశాలలో ఒకటిగా ప్ర‌సిద్ధిచెందింది. ఈ ఆల‌యాన్ని సంద‌ర్శించేందుకు నిత్యం ల‌క్షలాది మంది భ‌క్తులు త‌ర‌లివ‌స్తుంటారు. కేదారానాథ్ ఆల‌యాన్ని ప్ర‌తి ఏటా దీపావ‌ళి రెండు రోజులు త‌ర్వాత మూసివేయ‌డం జ‌రుగుతుంది. ఈ ఏడాది కూడా అదే ప‌ద్ధ‌తిని, అదే సంప్ర‌దాయాన్ని కొన‌సాగించారు. ఆల‌యం మూసివేత కార్య‌క్ర‌మం ఎంతో అట్ట‌హాసంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మాన్ని చూసేందుకు కూడా భారీ సంఖ్య‌లో భ‌క్తులు త‌ర‌లివ‌చ్చారు.

మ‌రో ఆరునెల‌ల‌పాటు ఆల‌య త‌లుపులు మూసివేత‌ : ఆల‌య మూసివేత కార్య‌క్ర‌మం ఇండియ‌న్ ఆర్మీ ఆధ్వ‌ర్యంలో జ‌రిగింది. బుధ‌వారం ఉద‌యం ఎనిమిది గంట‌ల‌కు ఈ కార్య‌క్ర‌మాన్ని ఆల‌య పూజారులు ఎంతో సంప్ర‌దాయంగా వేద‌మంత్రాల‌ను ప‌ఠిస్తూ ఆల‌య త‌లుపులు మూసివేశారు.ఈ కేదార‌నాథ్ ఆల‌య ప్రాముఖ్య‌త ఏంట‌టే.. ఆల‌య త‌లుపులు తెరిచే కార్య‌క్ర‌మం ఎంత ఘ‌నంగా నిర్వ‌హిస్తారో, అలాగే ఆల‌య మూసివేత కార్య‌క్ర‌మం ఉంటుంది. ఆరునెల‌ల పాటు ఈ ఆల‌యాన్ని మూసివేస్తారు. ఈ ఆరునెల‌లు శివయ్య పంచముఖీ దేవత విగ్రహాన్ని ఉఖిమ‌త్‌కు మారుస్తారు. ఈసారి కూడా అదేప‌ద్ధ‌తిని ఎంతో వైభవంగా జ‌రిపారు. భ‌క్తుల కోలాహాలంతో ఆ ప్రాంగ‌ణ‌మంతా హ‌ర‌హ‌ర‌మ‌హాదేవా అంటూ శివ‌నామ‌స్మ‌ర‌ణ‌తో మారుమోగింది. యాత్రికులు ఎంతో భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో విగ్ర‌హాన్ని ఉఖిమ‌త్‌కు మార్చ‌డం జ‌రిగింది. ఆ స‌మ‌యంలో వేలాదిమంది భ‌క్తులు శిమ‌నామ‌స్మ‌ర‌ణ చేసుకుంటూ న‌డిచారు. ఇక‌, ఈ ఆరునెల‌లు ఉఖిమ‌త్‌లోని భోలేనాథ్‌కు పూజ కార్య‌క్ర‌మాలు చేస్తారు.

 Note to devotees: Kedarnath temple doors closed..

నిర్దిష్ట సంఖ్యలో మాత్ర‌మే సందర్శకుల అనుమ‌తి : ఈ ఆరునెల‌ల ముగిసిన అనంత‌రం ఎవ‌రైతే ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించాల‌నుకుంటారో ముందుగా అధికారిక వెబ్‌సైట్ నుండి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ త‌ర్వాత అదే వెబ్‌సైట్ నుండి తమ ఇ-పాస్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అయితే, కొత్త మార్గదర్శకాల ప్రకారం, ప్రతిరోజూ నిర్దిష్ట సంఖ్యలో మాత్ర‌మే సందర్శకులను అనుమ‌తించడం జ‌రుగుతుంది. ఈ ఆలయం గౌర్ కుండ్ నుండి సుమారు 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శీతాకాలంలో భారీ హిమపాతం కార‌ణంగా ఈ ఆల‌యానికి వెళ్లే అన్నీ మార్గాల‌ను కూడా 6 నెలల పాటు మూసివేస్తారు. తిరిగి ఏప్రిల్, మే నెల‌ల్లో ఈ ఆల‌య తలుపులు, మార్గాలు తీయ‌డం జ‌రుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+