ఇగ వేగం: కీలకమైన 25 కేసుల విచారణ, ఐదుగురు న్యాయమూర్తులతో బెంచ్, వచ్చేవారం..
చాలా కేసులు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ ప్రక్రియంలో పెండింగ్‌లో ఉన్నాయి. అయితే వాటిలో కీలకమైన కేసులు కూడా ఉన్నాయి. దీంతో ఆ కేసుల విచారణ ప్రక్రియ వేగంగా చేపట్టాలని సుప్రీంకోర్టు భావించింది. ఈ మేరకు ఐదుగురు న్యాయమూర్తులకు కేసు విచారణ బాధ్యతలను అప్పగించింది. దీంతో ఆ కేసుల విచారణ ప్రక్రియ సత్వరమే ముగిసే అవకాశం ఉంది.

నోట్ బందీ..
పెద్ద నోట్ల రద్దు.. 2016లో ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. దీంతోపాటు 2020లో ఆర్థికంగా వెనకబడిన వారికి రిజర్వేషన్ల అంశం.. ఇలాంటి 25 కేసులు ఉన్నాయి. ఆ కేసులను వచ్చే వారం నుంచి ఐదుగురు సభ్యులతో కూడా బెంచ్ విచారణ చేపట్టింది. ఈ నెల 27వ తేదీన జస్టిస్ యూయూ లలిత్ సీజేఐగా బాధ్యతలు చేపడతారు. ఆ రెండు రోజులకు అంటే.. 29వ తేదీ నుంచి కీలక కేసుల విచారణ ప్రక్రియ ప్రారంభం అవుతుంది.

ముందే చెప్పిన జస్టిస్ లలిత్
కీలకమైన కేసులకు ప్రయారిటీ ఇచ్చి విచారణ జరుపుతామని సీజేఐ బాధ్యతలు చేపట్టబోయే జస్టిస్ యుయు లలిత్ ఇదివరకే పేర్కొన్నారు. కీలక కేసుల గురించి బెంచ్ ఏర్పాటు చేస్తామని.. అయితే ఏడాది పొడగున రాజ్యాంగ ధర్మాసనాలు పనిచేయడం సంస్థాగతంగా ఇబ్బంది ఉంటుందని తెలిపారు. అందుకోసమే బెంచ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

ఇవీ కేసులు
ఎన్ఆర్సీ, సీబీఐ, పెద్ద నోట్ల రద్దు, పంజాబ్‌లో సిక్కులను మైనార్టీగా గుర్తించాలని 2010 నుంచి కేసు పెండింగ్ ఉంది. ఇతర మతాలకు చెందిన చాలా కేసులు ఉన్నాయి. బహుభార్యత్వం కేసు 2018 నుంచి పెండింగ్‌లో ఉంది. ఏపీలో ముస్లింలలో వెనకబడిన తరగతుల గుర్తింపు అంశం 2006 నుంచి పెండింగ్‌లో ఉంది. ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ కేసులు 342, ఏడుగురు న్యాయమూర్తుల బెంచ్ కేసులు 15, 9 మంది న్యాయమూర్తుల కేసులు 135 కేసులు సుప్రీంకోర్టులో విచారణ క్రమంలో జాప్యం జరుగుతూ వస్తోంది.












Click it and Unblock the Notifications