Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కన్నీటిపర్యంతమైన రెజ్లర్లు: గంగలో వేసేందుకు పతకాలతో హరిద్వార్‌కు చేరుకున్న యోధులు

న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలపై తమ ఫెడరేషన్ చీఫ్, ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు కొంతమంది అగ్రశ్రేణి భారత రెజ్లర్లు. ఈ క్రమంలో నిరసనగా తమ పతకాలను 'నదిలో వేయడానికి ' హరిద్వార్‌లోని గంగా నది తీరానికి చేరుకున్నారు. ఎలాంటి తప్పు చేయలేదని తిరస్కరించిన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రెజ్లర్లు ఏప్రిల్ 23 నుంచి న్యూఢిల్లీలోని జంతర్ మంతర్‌ వద్ద నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే.

బ్రిజ్ భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా పునరుద్ధరించిన నిరసనకు కేంద్రంగా ఉన్న స్టార్ రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా, ఇతర నిరసనకారులతో కలిసి మంగళవారం సాయంత్రం 6 గంటలకు తమ పతకాలను పవిత్ర గంగా నదిలో విసిరివేస్తామని ఇంతకుముందే ప్రకటించారు.

Wrestlers

"ఈ పతకాలు మా ప్రాణం, ఆత్మ, మేము వాటిని గంగలో విసిరివేస్తాము. ఆ తర్వాత జీవించే ప్రసక్తే లేదు, కాబట్టి మేము ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తాము" అని ఆమె రాసిన ప్రకటనలో పేర్కొంది. ఈ క్రమంలోనే రెజ్లర్లు తమ పతకాలతో హరిద్వార్ చేరుకున్నారు. కాగా, టీవీ విజువల్స్‌లో మల్లయోధులు పతకాలను నదిలోకి విసిరేందుకు సిద్ధమవుతున్నప్పుడు తమ పతకాలను దగ్గరగా పట్టుకుని ఏడుస్తున్నట్లు కనిపించారు.

రెజ్లర్లు తమ ప్రణాళికను ప్రకటించిన కొన్ని గంటల తర్వాత.. హరిద్వార్ పోలీసులు రెజ్లర్లను జిల్లాలోకి ప్రవేశించకుండా లేదా పతకాలు ముంచకుండా ఆపలేమని స్పష్టం చేశారు. హరిద్వార్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అజయ్ సింగ్ ఇలా అన్నారు.. "రెజ్లర్లు ఏదైనా చేయగలరు. వారు తమ పతకాలను పవిత్ర గంగలో నిమజ్జనం చేయడానికి వస్తుంటే మేము వారిని అడ్డుకోము. నా సీనియర్ అధికారుల నుంచి నాకు అలాంటి సూచనలు ఏవీ అందలేదు' అని తెలిపారు.

' తాము కష్టపడి సంపాదించిన పతకాలను నదిలో ముంచుతామని ప్రకటించినప్పటి నుంచి ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సమాచారమూ రాలేదని పునియా మీడియాకు తెలిపారు.

ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష

తమ పతకాలను నిమజ్జనం చేసిన తర్వాత ఇండియా గేట్ వద్ద "ఆమరణం వరకు" నిరాహార దీక్షకు దిగుతామని రెజ్లర్లు స్పష్టం చేశారు. బ్రిజ్ భూషణ్ తొలగించేవరకు తాము విశ్రమించమని తెలిపారు. అయితే ఢిల్లీ పోలీసులు, ఈ రెజ్లర్లను ఇండియా గేట్‌కు వెళ్లడానికి అనుమతించే అవకాశం లేదని తెలుస్తోంది.

"ఇండియా గేట్ నిరసన ప్రదేశం కాదు, అక్కడ నిరసనలు చేయడానికి మేము వారిని (మల్లయోధులు) అనుమతించము" అని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.
"వారు అటువంటి అభ్యర్థనతో ఇప్పటి వరకు మమ్మల్ని సంప్రదించలేదు, వారు నిరసన చేయాలనుకుంటే, వారు సంబంధిత డిసిపికి వ్రాతపూర్వక కమ్యూనికేషన్ సమర్పించవలసి ఉంటుంది, దాని తర్వాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది" అని ఆయన చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+