Nimisha Priya: నిమిష ప్రియను రక్షించలేం..! సుప్రీంకు తేల్చేసిన కేంద్రం..!
గల్ఫ్ దేశమైన యెమెన్ లో మరణశిక్ష పడిన కేరళ నర్సు నిమిష ప్రియను కాపాడే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ క్లారిటీ ఇచ్చేసింది. నిమిష ప్రియను రక్షించేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన కేసు విచారణ సందర్భంగా అటార్నీ జనరల్ ఈ మేరకు స్పష్టత ఇచ్చారు. భారత్ తో దౌత్య సంబంధాలు లేని యెమెన్ లో నిమిష ప్రియ మరణశిక్షను ఆపే విషయంలో ఎలాంటి ఆప్షన్లూ లేవని ఏజీ వెంకటరమణి వెల్లడించారు.
2008లో నర్సుగా పనిచేసేందుకు కేరళ నుంచి యెమెన్ వెళ్లిన నిమిష ప్రియ తిరిగి 2011లో స్వరాష్ట్రానికి వచ్చి థామస్ ను పెళ్లి చేసుకుంది. యెమెన్ లో నిబంధనల ప్రకారం వ్యాపారం చేసేందుకు అక్కడి స్థానిక వ్యాపార భాగస్వామిని ఎంచుకోవాలి. అలా వీళ్లిద్దరూ స్థానిక వ్యాపారి మెహదీ అనే వ్యక్తిని ఎంచుకున్నారు. కూతురు ఫంక్షన్ కోసం భారత్ వచ్చిన నిమిష ప్రియ.. ఓ పని ఉండి భర్త రాకపోవడంతో ఒంటరిగానే యెమెన్ వెళ్లింది.

అక్కడ మెహదీ ఆమెను ఏమార్చి డబ్బులు లాక్కుని, భార్యగా నమ్మించి కాపురం చేయడం ప్రారంభించాడు. చివరికి అతనికి మత్తు మందు పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేయగా.. డోస్ ఎక్కువై చనిపోయాడు. ఈ కేసులో నిమిష ప్రియ సౌదీకి పారిపోతుండగా 2017లో పోలీసులు పట్టుకున్నారు. ఆ తర్వాత విచారణలో ఆమెను దోషిగా తేల్చారు. దీంతో ఈ నెల 16న ఆమెకు ఉరిశిక్ష విధించబోతున్నారు. దీన్ని ఆపేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా దౌత్య సంబంధాల్లేని యెమెన్ తో ప్రైవేట్ లాబీయింగ్ మినహా మరో అవకాశం లేకుండా పోయింది.
మరోవైపు యెమెన్ లో మృతుల కుటుంబాలకు కొంత డబ్బు ఇచ్చి ఉరిశిక్ష నుంచి బయటపడే అవకాశం ఉంది. దీంతో 8.6 కోట్లు ఇచ్చేందుకు నిమిష ప్రియ కుటుంబం సిద్ధమైంది. అయితే మృతుడి కుటుంబ సభ్యుల నుంచి స్పందన లేకపోవడంతో నిమిష ప్రియకు ఉరిశిక్ష తప్పేలా లేదు.












Click it and Unblock the Notifications