• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

స్టార్వింగ్ ఫర్ ఆక్సిజన్ : కరోనాతో ఆర్గాన్స్ ఫెయిల్యూర్‌.. రోగి శరీరంలో అసలెందుకిలా జరుగుతుంది?

|

కోవిడ్-19 పేషెంట్లలో కేవలం 15శాతం మందికి మాత్రమే హాస్పిటల్ ట్రీట్‌మెంట్,ఐసీయూ,ఆక్సిజన్ సప్లై లేదా వెంటిలేటర్ అవసరం ఏర్పడుతోందని వైద్య నిపుణులు,అధికారులు చెబుతున్నారు. కరోనా బారినపడుతున్న ప్రతీ ఆరుగురిలో ఒకరు తీవ్ర అనారోగ్యం,శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చాలామంది యువతలో కరోనా లక్షణాలు బయటకపోవడం లేదా దాని ప్రభావం అంతగా ఉండకపోవడం జరుగుతోంది. దీనికి కారణం.. సాధారణంగా ఆరోగ్యవంతులైన యువతీ యువకులకు కరోనా వల్ల పెద్ద హానీ ఉండకపోవడమేనని చెబుతున్నారు. అయితే అప్పటికే ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నవారిలో దీని తీవ్రత ఎక్కువగా ఉంటుందంటున్నారు. అలాంటి పేషెంట్లలో ఇది హైపోక్సియాకు దారితీయవచ్చునని.. అంటే,శరీరం ఆక్సిజన్ అనే ఆకలికి గురికావచ్చునని చెబుతున్నారు.

శ్వాస ప్రక్రియపై ఎలా దాడి చేస్తుంది..

శ్వాస ప్రక్రియపై ఎలా దాడి చేస్తుంది..

వైద్య నిపుణులు వెల్లడిస్తున్న వివరాల ప్రకారం.. కరోనా వైరస్ లేదా SARS-CoV-2 సోకిన వ్యక్తి శరీరంలో కెమికల్ యాక్షన్ కారణంగా ఎర్ర రక్త కణాలలోని హిమోగ్లోబిన్‌లో ఉన్న హీమ్ గ్రూపులో ఇది చేరుతుంది. అప్పటినుంచి సాధారణ శ్వాస ప్రక్రియపై ఇది ప్రభావం చూపడం మొదలుపెడుతుంది. సాధారణ శ్వాస ప్రక్రియలో.. హిమోగ్లోబిన్ అనేది కార్బన్ డయాక్సైడ్‌ను ఊపిరితిత్తుల ద్వారా బయటకు పంపిస్తుంది. అదే ఊపిరితిత్తుల నుంచి శరీరానికి కావాల్సిన ఆక్సిజన్‌ను రక్తం ద్వారా సరఫరా చేస్తుంది.

హిమోగ్లోబిన్‌పై ఎఫెక్ట్.. ఆర్గాన్స్ ఫెయిల్యూర్..

హిమోగ్లోబిన్‌పై ఎఫెక్ట్.. ఆర్గాన్స్ ఫెయిల్యూర్..

కరోనా సోకిన పేషెంట్లలో.. శరీరంలోని కార్బన్ డయాక్సైడ్‌ను బయటకు పంపించి ఆక్సిజన్‌ను అందించే హిమోగ్లోబిన్‌ను వైరస్‌ అడ్డుకుంటుంది. దాంతో పేషెంట్‌లో శ్వాస సమస్య తలెత్తుంది. రక్తానికి క్రమంగా ఆక్సిజన్ అందడం ఆగిపోతుంది. సాధారణంగా ఒక ఆరోగ్యవంతమైన మనిషి శరీరంలో ఆక్సిజన్ స్థాయి 95శాతం వరకు ఉంటుంది. The Lancet రిపోర్ట్ ప్రకారం కోవిడ్-19 పేషెంట్‌లో ఇది 60 నుంచి 50శాతానికి పడిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో శరీరంలోని చాలా అవయవాలకు ఆక్సిజన్ అందక,అవి పనిచేయని పరిస్థితి తలెత్తుతుంది. కాబట్టే కోవిడ్-19 పేషెంట్లలో ఎక్కువమంది రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్(ARDS) వల్ల కాకుండా గుండెపోటు,కిడ్నీ ఫెయిల్యూర్,ఇతరత్రా సమస్యలతో మృతి చెందుతున్నారు.

రోగుల శరీరంలో ఆక్సిజన్ కొరత కారణంగా..

రోగుల శరీరంలో ఆక్సిజన్ కొరత కారణంగా..

కరోనా వైరస్ లోడ్ ఎక్కువగా ఉన్న పేషెంట్లలో ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయి. వైరస్ కారణంగా హిమోగ్లోబిన్ రక్తంలో ఐరన్‌ను విడుదల చేయడం వల్లే ఇలా జరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. కోవిడ్-19 పేషెంట్ల సిటి స్కాన్లలో ఇదే విషయమై వెల్లడైందని.. చైనా,యూరోప్ వైద్యుల అధ్యయనాల్లోనూ ఇదే తేలిందని చెబుతున్నారు. కోవిడ్ -19 నుంచి కోలుకుని మళ్లీ ఆసుపత్రిలో చేరిన కొంతమంది రోగుల్లో హైపోక్సియా వల్ల శ్వాస సమస్యలను గుర్తించారు. నిజానికి వీరిలో శ్వాస ప్రక్రియ సాధారణంగానే ఉంటుందని.. ఉచ్వాస,నిశ్వాసలు కూడా సరిగానే తీసుకుంటారని వైద్యులు చెబుతున్నారు. అయితే వీరి శరీరం ఆక్సిజన్ అనే ఆకలికి గురవుతుందన్నారు. ఇలాంటి కేసుల్లో.. హిమోగ్లోబిన్ కేవలం వ్యర్థాలను మాత్రమే బయటకు పంపిస్తుందని,శరీరంలోని అవయవాలకు కావాల్సిన లైఫ్ బ్లడ్‌ను సరఫరా చేయదని అంటున్నారు.

అందుకే కృత్రిమ ఆక్సిజన్

అందుకే కృత్రిమ ఆక్సిజన్

ఇలాంటి కేసుల్లో కృత్రిమ శ్వాస అందించకపోతే శరీరంలోని అవయవాలకు రక్తం ద్వారా ఆక్సిజన్ సరఫరా కాక అవి చెడిపోయే అవకాశం ఉందంటున్నారు. హిమోగ్లోబిన్ రక్తం ద్వారా సరఫరా చేసే ఆక్సిజన్‌ను వైరస్ అడ్డుకుంటుంది కాబట్టి.. కృత్రిమ ఆక్సిజన్ అవసరం అవుతుంది.The Lancet రిపోర్ట్ ప్రకారం కోవిడ్-19 సోకిన మొదటి 150 పేషెంట్లపై ైనా అధ్యయనం చేస్తోంది. ఇందులో 68 మంది చనిపోగా 82 మంది డిశ్చార్జి అయ్యారు. ఇందులో 53శాతం మంది శ్వాసకోశ సమస్యతో చనిపోగా.. 7శాతం మంది శరీరానికి ఆక్సిజన్ సరఫరా ఆగిపోవడం వల్ల చనిపోయారు. మరో 33శాతం మంది ఈ రెండు కారణాలతో మృతి చెందారు.

English summary
Health experts and authorities maintain that only about 15 per cent of Covid-19 patients actually need hospitalization, treatment in ICU, oxygen supply for breathing or ventilator support. Around 1 out of every 6 people who gets COVID-19 becomes seriously ill and develops difficulty breathing, reads the health ministry explainer on novel coronavirus outbreak. Yet, the sheer number of deaths due to Covid-19, a disease caused by novel coronavirus, is overwhelming.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X