ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల ప్రధానాధికారి విఎస్ సంపత్ విడుదల చేశారు. ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను ఆయన శుక్రవారం ప్రకటించారు. 5 రాష్ట్రాల్లో లక్షా 30వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, 11 కోట్ల మంది ఓటర్లున్నారని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఓటర్లలో చైతన్యం కలిగించేందుకు తొలిసారిగా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించినట్లు ఎన్నికల ప్రధానాధికారి సంపత్ తెలిపారు.
230 స్థానాలు కలిగిన మధ్యప్రదేశ్ శాసనసభకు నవంబర్ 25న, 40 స్థానాలు కలిగిన మిజోరాం శాసనసభకు డిసెంబర్ 4న, 70స్థానాలు కలిగిన ఢిల్లీ శాసనసభకు డిసెంబర్ 4న, 200స్థానాలు కలిగిన రాజస్థాన్ శాసనసభకు డిసెంబర్ 1న ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. 90 స్థానాలు కలిగిన ఛత్తీస్‌గఢ్ శాసనసభకు నవంబర్ 11, 19తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయని చెప్పారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ డిసెంబర్ 8న జరుగుతుందని ఆయన తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఐదు రాష్ట్రాల్లోనూ వెంటనే అమల్లోకి వస్తుందని చెప్పారు. డిసెంబర్ 4న గుజరాత్, తమిళనాడు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతాయని ఆయన తెలిపారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రచారాలతో ఈ ఐదు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కనుంది. కాగా ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థి ఎవరూ లేకపోతే వారు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్‌లో సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఏర్పాటు చేసిన ‘పై వారిలో ఎవరూ కాదు' అనే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications