మాజీ ఎంపీ, నటి రమ్యపై ‘దేశద్రోహం’కేసు
బెంగళూరు: బహుబాష నటి, మాజీ ఎంపీ, కాంగ్రెస్ నాయకురాలు రమ్య మీద దేశద్రోహం కేసు నమోదు అయ్యింది. కర్ణాటకలోని కూడగు జిల్లా మడికేరిలోని జేఎంఎఫ్ సీ కోర్టులో న్యాయవాది విఠల్ గౌడ అనే ఆయన రమ్య మీద కేసు పెట్టారు.
ఫిర్యాదు స్వీకరించిన న్యాయమూర్తి ఈనెల 27వ తేదిన కేసు విచారణ చేస్తామని చెప్పారు. ఇటీవల పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లో జరిగిన సార్క్ సమావేశాలకు రమ్య హాజరైనారు. తిరిగి భారత్ చేరుకున్న రమ్య శనివారం (ఆగస్టు 22) కర్ణాటకలోని మండ్యలో మాట్లాడారు.
కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ చెప్పినట్లు పాకిస్థాన్ నరకం కాదని, అక్కడ చాల మంచి వారు ఉన్నారని దాయాదులకు కితాబు ఇచ్చారు. తాను పాకిస్థాన్ కు వెళ్లి సార్క్ సమావేశాల్లో పాల్గోన్నానని, అక్కడ వాతావరణం బాగుందని అన్నారు.

కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ అన్నట్లు అక్కడ నాకు ఎలాంటి నరకం కనపడలేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై పలు విద్యార్థి సంఘాలు, బీజేపీ నాయకులు రమ్య మీద మండిపడ్డారు.
శత్రుదేశం అయిన పాకిస్థాన్ ను పోగిడిన రమ్య మీద చట్టపరంగా పోరాటం చేస్తామని అన్నారు. ఇప్పుడు ఈమె చేసిన వ్యాఖ్యలపై కూడుగు జిల్లాలోని మడికేరిలో కేసు నమోదు అయ్యింది. రమ్య వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మౌనంగా ఉంది.












Click it and Unblock the Notifications