వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మణిపూర్ దిగ్బంధానికి తెర దించేదన్నడు?

మణిపూర్‌లో నాలుగు నెలలకు పైగా కొనసాగుతున్న ఆర్థిక దిగ్భందానికి తెర దించడమే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం అని మణిపూర్ నూతన సీఎం బీరెన్ . అందుకు నిరాక

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

ఇంఫాల్: ఈశాన్య భారతావనిలోని మరో రాష్ట్రం కమలనాథుల హస్తగతమైంది. ఎన్నికల ప్రక్రియ సజావుగా ముగిసినందుకు ప్రతి ఒక్కరికీ.. ప్రత్యేకించి కేంద్ర ఎన్నికల సంఘానికి చాలా ఉపశమనం లభిస్తుంది. ఒకటి రెండు సార్లు బాంబు పేలుళ్లు మినహా ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగిపోయింది.

ఏడు కొండ జిల్లాలను మరో ఏడు జిల్లాలుగా విభజించిన మాజీ సీఎం ఇబోబిసింగ్ నాయకత్వాన్ని సవాల్ చేస్తూ యునైటెడ్ నాగా కౌన్సిల్ (యూఎన్‌సీ) గత ఏడాది నవంబర్ ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలోని రెండు జాతీయ రహదారుల దిగ్భందం మాత్రం యథాతధంగానే కొనసాగుతోంది. నలు దిశల ఆర్థిక దిగ్బంధం నీడలో ఎన్నికల ప్రక్రియ ముగిసి.. బీజేపీ నేత బీరెన్ సింగ్ సారథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. శుక్రవారానికి ఆర్థిక దిగ్బంధం ప్రారంభించి 135వ రోజుకు చేరుకున్నది.

యూనైటెడ్ నాగా కౌన్సిల్ (యూఎన్‌సీ) ఆధ్వర్యంలో ఇంఫాల్ - దిమాపూర్ మధ్య గల రెండో జాతీయ రహదారి, ఇంఫాల్ - జిరిబాం మధ్య గల 37వ జాతీయ రహదారిని నవంబర్ ఒకటో తేదీ నుంచి దిగ్బంధం కొనసాగుతున్నది. ఇంఫాల్ నగరంలో సీఎంగా ప్రమాణ స్వీకారానికి ర్యాలీగా బయలురే ముందు సాగిన విజయోత్సవ ర్యాలీలో నూతన సీఎం బీరెన్ సింగ్ మాట్లాడుతూ ఆర్థిక దిగ్బంధం ఎత్తివేయడమే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యం అని తేల్చి చెప్పారు. కానీ నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పిఎఫ్) అనుబంధం సంస్థ 'యుఎన్‌సి' ఆధ్వర్యంలో సాగుతున్న ఆర్థిక దిగ్బంధం తొలగించడం మాత్రం బీరెన్‌సింగ్ ప్రభుత్వానికి కష్ట సాధ్యంగా కనిపిస్తోంది.

NPF, an ally of BJP: Will Manipur CM be able to lift economic blockade?

బీరెన్ సింగ్ సర్కార్ సంప్రదింపులు జరిపితేనే పరిష్కారమా?

యూఎన్‌సీ, ఎన్పీఎఫ్ మధ్య సన్నిహిత సంబంధాల కారణంగా ఆర్థిక దిగ్బంధం తొలగించడానికి బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వం పలు దఫాలు చర్చలు జరుగాల్సి ఉంటుందని స్థానిక రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. జిల్లాల విభజన ప్రక్రియ పాలన సజావుగా సాగేందుకు మాత్రమేనని గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాదిస్తే.. తమను సంప్రదించకుండా నిర్ణయం తీసుకున్నదని నాగా గ్రూపుల మండిపడ్తూ వచ్చాయి.

కొండెక్కిన నిత్యావసర వస్తువుల ధరలు

ఇంఫాల్ నగరంలో జరిగిన ఎన్నికల సభలోనూ బీజేపీ అధికారంలోకి వచ్చిన 48 గంటల గడువులోగా ఆర్థిక దిగ్బంధం తొలగిస్తానని మణిపూరీలకు ప్రధాని మోదీ హామీనిచ్చారు. ఆర్థిక దిగ్బంధంతో నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కాయి. ఇంధన ధరలు తగ్గే అవకాశాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఆర్థిక దిగ్బంధం సమస్య పరిష్కరించడానికి ముందు ప్రభుత్వం తమతో సంప్రదింపులు జరుపలేదని యూఎన్‌సీ నేతలు మండి పడ్తున్నారు. అంత వరకు తమ ఆర్థిక దిగ్బంధం యదావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు.

అడపాదడపా వచ్చే సరుకులు బ్లాక్ మార్కెట్‌కే..

ఆర్ధిక దిగ్బంధం కొనసాగుతున్నా 900 ట్రక్కులు మాత్రం మణిపూర్ రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తున్నాయి. కానీ ఈ నిత్యావసర వస్తువులన్నీ బ్లాక్ మార్కెట్‌కు తరలి వెళ్తున్నాయని స్థానికులు చెప్తున్నారు. బీరెన్ సింగ్ ప్రభుత్వం ఈ నెల 23వ తేదీన సబా విశ్వాసాన్ని పొందాలి.

కష్టాలు తగ్గించడమేనన్న బీరెన్ సింగ్

బీరెన్ సింగ్ సర్కార్ క్యాబినెట్‌లో ఆయనతోపాటు మరో బీజేపీ ఎమ్మెల్యే, నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) నలుగురు, లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) ఒకరు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒకరు ప్రమాణం చేశారు.మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ తన క్యాబినెట్‌లో మరో ముగ్గురిని చేర్చుకునే అవకాశమున్నది. ప్రజల కష్టాల నుంచి తప్పించడమే లక్ష్యమని మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ చెప్పారు.

English summary
First, the assembly elections in Manipur were conducted under the shadow of economic blockade on March 4 and March 8. To everyone's relief (especially of the Election Commission), the polls were conducted almost 'smoothly' with incidents of a couple of bomb blasts that rocked the state before and during the elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X