విదేశీ చోరబాటుదారులను వదిలిపెట్టం : అమిత్ షా

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఎన్ఆర్‌సీ అవసరం లేదని మమతా బెనర్జీ ఖరాఖండిగా చెప్పిన నేపథ్యంలోనే ఆయన కూడ అంతే ఘాటుగా స్పందించారు. తృణముల్ కాంగ్రెస్ ఎంతా వ్యతిరేకించినా దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీని అమలు చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. చోరబాటుదారులను ఎట్టిపరిస్థితుల్లో దేశంలో ఉండనివ్వమని చెప్పిన ఆయన దేశంలో ఉన్న శరణార్థులకు పౌరసత్వం కల్పిస్తామని చెప్పారు.

బెంగాల్‌లో పర్యటించిన అమిత్ షా

బెంగాల్‌లో పర్యటించిన అమిత్ షా

పార్లమెంట్ ఎన్నికల తర్వాత మొదటిసారిగా అమిత్ షా పశ్చిమబెంగాల్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా కోల్‌కతాలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన పాల్గోన్నారు. ఈ నేపథ్యంలోనే తృణముల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సబ్యసాచి దత్తా అనే ఎమ్మెల్యే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అమిత్ షా ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంధర్భంగా బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

 వలసదారులను దేశంలో ఉండనివ్వం

వలసదారులను దేశంలో ఉండనివ్వం


ఈ నేపథ్యంలోనే ఎన్నికల తర్వాత మొదటిసారిగా బెంగాల్‌లో పర్యటించిన అమిత్ షా ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నిప్పులు చెరిగారు. ఎన్‌ఆర్‌సీ పై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని అన్నారు. అక్రమ వలసదారులను కాపాడుకునేందుకే దీదీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. భారత దేశ వ్యాప్తంగా ఎన్ఆర్‌సీని అమలు చేస్తామని ఆయన చెప్పారు. ఎన్‌ఆర్‌సీ అందరిని ఏకం చేస్తుందని చెప్పిన ఆయన ఎవరిని మతాల పేరుమీద వెళ్లగొట్టమని స్పష్టం చేశారు. అయితే అక్రంగా భారత్‌లో నివాసం ఉంటున్న వారిని ఖచ్చితంగా వెళ్లగొడతామని ఆయన హెచ్చరించారు.

ఓటు బ్యాంకు కోసమే ఎన్‌ఆర్‌సీ వ్యతిరేకిస్తున్నారు.

ఓటు బ్యాంకు కోసమే ఎన్‌ఆర్‌సీ వ్యతిరేకిస్తున్నారు.


పశ్చిమ బెంగాల్‌లో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నప్పుడు విదేశీయుల్నీ తీవ్రంగా వ్యతిరేకించిన మమతా బెనర్జీ ఇప్పుడు వారిని సమర్ధిస్తోందోని అన్నారు. మమతా బెనర్జీ వ్యతిరేకించిన సమయంలో విదేశీయులు అంతా కమ్యునిస్టులకు మద్దతుగా ఉన్నారని, కాని ఇప్పుడు మమతాకు మద్దతు పలుకుతున్నారని మండిపడ్డారు. అందుకే ఆమే ఎన్ఆర్‌సీని వ్యతిరేకిస్తున్నారని ఆయన అన్నారు. మరోవైపు బెంగాల్ రాష్ట్రం ఇప్పటికే సర్వనాశనం అయిందని చెప్పిన ఆయన రాష్ట్రానికి పునర్‌వైభవం తీసుకువస్తామని ఆయన చెప్పారు.

 ఇటివలే మోడీ, అమిత్ షాలతో భేటి అయిన మమతా

ఇటివలే మోడీ, అమిత్ షాలతో భేటి అయిన మమతా

కాగా గత నెలలో ఢిల్లీలో పర్యటించిన మమతా బెనర్జీ ప్రధాని నరేంద్రమోడీతో పాటు, అమిత్ షా కూడ భేటి అయింది. ఈ నేపథ్యంలోనే పశ్చిమబెంగాల్‌లో ఎన్‌ఆర్‌సీ అమలు అవసరం లేదని చెప్పింది. ఇందుకు సంబంధించి వినతి పత్రం కూడ అందించారు. దీంతో దీదీ మరియు మోడీ మధ్య సంఖ్యత చేకూరిందని అంతా భావించారు. కాని అమిత్ షా పర్యటనతో మరోసారి ఇరు పార్టీల మధ్య పోలిటికల్ వార్ మొదటికి వచ్చినట్టయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+