• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆప్ఘనిస్తాన్‌పై ఫోకస్ పెట్టిన అజిత్ ధోవల్: ఏడు దేశాల భద్రతాధికారులతో ట్రబుల్ షూటర్ కీలక భేటీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కరడు గట్టిన మత ఛాందసవాదులుగా ప్రపంచవ్యాప్తంగా ముద్రపడిన తాలిబన్ల దురాక్రమణలోని ఆప్ఘనిస్తాన్ వెళ్లిన తరువాత.. పొరుగు దేశాలు తమ వైఖరిని మార్చుకుంటోన్నాయి. ఇదివరకే ఓ సారి తాలిబన్ల పరిపాలనను చవి చూసిన అనుభవం ఉన్నందున ఆ దేశంపై మున్ముందు ఎలాంటి దౌత్యనీతిని అనుసరించాల్సి ఉంటుందనే విషయంపై మల్లగుల్లాలు పడుతున్నాయి. తాలిబన్ల పరిపాలనలో ఆఫ్ఘనిస్తాన్ మరోసారి ఉగ్రవాదులకు అడ్డాగా మారే ప్రమాదం ఉందనే ఆందోళనలను వ్యక్తం చేస్తోన్నాయి.

అజిత్ ధోవల్ సారథ్యంలో..

అజిత్ ధోవల్ సారథ్యంలో..

ఉగ్రవాదులు, ఉగ్రవాద గ్రూపులకు షెల్టర్ ఇస్తారనే పేరున్న తాలిబన్ల సారథ్యంలోని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని కట్టడి చేయడానికి ఎలాంటి కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలనే విషయంపై దృష్టి సారించాయి. దీని కోసం ఆయా దేశాలు భారత సహకారాన్ని తీసుకుంటోన్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌పై అనుసరించాల్సిన వైఖరిపై చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ట్రబుల్ షూటర్‌గా పేరున్న జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్‌కు ఈ బాధ్యతలను అప్పగించింది.

ఏడు దేశాల జాతీయ భద్రత అధికారుల భేటీ..

ఏడు దేశాల జాతీయ భద్రత అధికారుల భేటీ..

అజిత్ ధోవల్ సారథ్యంలో మొత్తం ఏడు దేశాల జాతీయ భద్రత సలహాదారులు సమావేశం అయ్యారు. దేశ రాజధానిలో ఈ కీలక భేటీ కొద్దిసేపటి కిందటే ఆరంభమైంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు దీనికి హాజరయ్యారు. తాలిబన్ల చేతుల్లోకి ఆప్ఘనిస్తాన్ వెళ్లిన తరువాత ఇప్పటిదాకా ఈ తరహా సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహించలేదు. దీనితో అందరి దృష్టీ ఈ భేటీపైనే నిలిచింది. ఇరాన్, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, రష్యా, తజకిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల జాతీయ భద్రత సలహాదారులు ఇందులో పాల్గొన్నారు.

మానవ హక్కులు.. తాలిబన్లు

మానవ హక్కులు.. తాలిబన్లు

అజిత్ ధోవల్ ప్రారంభోపన్యాసం చేశారు. ఆఫ్ఘనిస్తాన్‌లో చోటు చేసుకుంటోన్న పరిణామాలన్నింటినీ నిశితంగా పరిశీలిస్తున్నామని అన్నారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు మానవతా సహాయాన్ని అందించడంతో పాటు.. ఆ దేశాన్ని పాలిస్తోన్న తాలిబన్ల ప్రభుత్వ వైఖరి పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అజిత్ ధోవల్ చెప్పారు. ఆప్ఘనిస్తాన్ ప్రజలు ఆశ్రయాన్ని కల్పించడానికి అన్ని దేశాలు కూడా తమ సరిహద్దులను తెరిచి ఉంచే విషయాన్ని మానవతా దృక్పథంతో పరిశీలించక తప్పదని పేర్కొన్నారు.

పరస్పర సహకారంతోనే..

పరస్పర సహకారంతోనే..

తాలిబన్లతో సరిహద్దులను పంచుకుంటోన్న దేశాలు ఒకే వేదిక మీదికి రావాలని, ఐక్యంగా ఉండాలని, పరస్పరం సహాయ, సహకారాలను అందించుకోవాలనేది ఈ అత్యున్నత భేటీ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. తాలిబన్ల ప్రభుత్వం అంతర్జాతీయ సమాజంలో కలవడానికి ఇష్టపడితే.. షరతులతో కూడిన అనుమతులను మంజూరు చేసే విషయాన్ని పరిశీలించాల్సి ఉంటుందని ఆయా దేశాల జాతీయ భద్రత సలహాదారులు అభిప్రాయపడ్డారు. ఐక్యరాజ్య సమితి ఈ దిశగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని చెప్పారు.

మాదక ద్రవ్యాల్యు, ఉగ్రవాదం..

మాదక ద్రవ్యాల్యు, ఉగ్రవాదం..

మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే పరిస్థితులు తమ దేశంలో నెలకొన్నాయని తజకిస్తాన్ జాతీయ భద్రత విభాగం కార్యదర్శి నస్రుల్లో రహ్మత్‌జాన్ మహమ్ముద్జోదా ఆందోళన వ్యక్తం చేస్తారు. ఆఫ్ఘనిస్తాన్‌తో సరిహద్దులను పంచుకుంటున్నామని, ఇప్పటికీ.. అక్కడి పరిస్థితులు సమస్యాత్మకంగా ఉంటోన్నాయని చెప్పారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నివారించడానికి సరిహద్దుల్లో కట్టుదిట్టమైన తనిఖీ వ్యవస్థను ఏర్పాటు చేశామని వివరించారు.

వలసలు, శరణార్థులు..

వలసలు, శరణార్థులు..

ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన తరువాత ఆ దేశంలో మొదలైన వలసలు ప్రధాన సమస్యగా మారాయని ఇరాన్ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి రియల్ అడ్మిరల్ అలీ షమ్ఖానీ తెలిపారు. శరణార్థుల తాకిడి తీవ్రతరమైందని పేర్కొన్నారు. దీన్ని పరిష్కరించుకోవడానికి తక్షణమే సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అవసరమని అన్నారు. సమష్ఠిగా దీన్ని పరిష్కరించుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. తాలిబన్ల ప్రభావానికి లోనయ్యే అన్ని దేశాలు కూడా ముందుకు రావాలని సూచించారు.

English summary
National Security Adviser Ajit Doval chairs the regional security dialogue on Afghanistan in New Delhi. The meeting is being attended five Central Asian countries, along with Russia and Iran.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X