వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్ :అక్కడ మహిళలు నగ్నంగా, కెమెరాల్లో దృశ్యాలు, 11 మంది మృతికి కారణమిదేనా?

ఢిల్లీలోని మానసిక వికలాంగుల ఆశ్రమంలో మహిళలకు కనీస సౌకర్యాలు లేని విషయాన్ని మహిళా కమీషన్ సభ్యులు గుర్తించారు. నగ్నంగా మహిళలు తిరుగుతుండగా సిసిటివి కెమెరాల్లో రికార్డు అవుతున్నాయని తెలుసుకొని షాకయ్యారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆశ్రమంలో అధికారులు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. అంతే కాదు మహిళలు బట్టలు లేకుండా తిరుగుతున్నారు.అయితే సిసి కెమెరాల్లో ఈ దృశ్యాలన్నీ రికార్డు అవుతున్నాయి.ఈ ఆశ్రమాన్ని పరిశీలించిన మహిళ కమీషన్ సభ్యులు షాక్ తిన్నారు.

ఢిల్లీలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తోన్న మానసిక వికలాంగుల ఆశ్రమంలో అధికారుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది.కనీస మానవత విలువలను కూడ ఆ ఆశ్రమంలో లేవని ఈ ఆశ్రమాన్ని సందర్శించిన మహిళ కమీషన్ సభ్యులు విస్తుపోయారు.

ఢిల్లీలో ఆశాకిరణ్ అనే ఓ సంస్థ ఉంది. ఇందులో మానసిక వికలాంగులకు ఆశ్రయం కల్పిస్తారు. దీని భాద్యతలను ప్రభుత్వం చూసుకొంటుంది. అయితే గత రెండు మాసాల్లో దాదాపుగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ అంశాన్ని పరిశీలించారు మహిళ కమీషన్ సభ్యులు.

nude woman walking recording on cc tv footage in delhi

రెండు మాసాల్లో 11 మంది చనిపోవడంపై ఢిల్లీ మహిళ కమీషన్ చైర్ పర్సన్ స్వాతి మాలివాల్, మరో సభ్యురాలు ప్రమీలా గుప్తా వెళ్ళారు. శనివారం రాత్రంతా అక్కడే గడిపారు.

అయితే ఆశ్రమంలో కనీస సౌకర్యాలు కూడ లేవని వారు గుర్తించారు.స్నానం చేసేందుకు ఆరుబయటే మహిళలను వివస్త్రలను చేసి నిలబెడుతన్నారు.

పూర్తి నగ్నంగా ఉన్న స్త్రీలు కారిడార్ లో అటూ ఇటూ తిరుగుతున్నారు. అయితే ఆ కారిడార్ లో సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేశారు.

ఈ సిసిటివి కెమెరాలను ఆపరేట్ చేస్తోంది మాత్రం పురుషులు. ఈ దృశ్యాలను చూసి మహిళ కమీషన్ సభ్యులు షాక్ కు గురయ్యారు. ఈ మానకసిక వికలాంగు కేంద్రంలో కనీస సౌకర్యాలు లేవని వారు గుర్తించారు.

350 మంది ఉండాల్సిన చోట 450 మందిని ఉంచారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా సాంఘీక సంక్షేమ శాఖకు నోటీసులు జారీ చేసినట్టుగా మహిళ కమీషన్ సభ్యులు తెలిపారు. 72 గంటల్లోపుగా సాంఘీక సంక్షేమ శాఖ నుండి వచ్చే వివరణ ఆధారంగా నిర్ణయం తీసుకోనుంది మహిళ కమీషన్.

అంతేకాదు ఇటీవల కాలంలో 11 మంది మహిళలు ఇక్కడ మరణించారు. ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ఈ ఘటనలపై విచారణ చేపట్టనున్నట్టు మహిళ కమీషన్ ప్రకటించింది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వానికి నివేదికను పంపించనున్నట్టు మహిళ కమీషన్ చైర్మెన్ స్వాతి మాలివాల్ ప్రకటించారు.

English summary
nude woman walking recording on cc tv footage in delhi,woman commission members visited mentally disabled home in delhi on saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X