ప్రియుడి భార్యను. కుమారుడ్ని హత్య చేసిన నర్సు

Murder
న్యూఢిల్లీ: అక్రమ సంబంధం రెండు హత్యలకు దారి తీసింది. ఓ మహిళ తన మూడున్నర ఏళ్ల కుమారుడిని, ప్రియుడి భార్యను హత్య చేసింది. పశ్చిమ ఢిల్లీలోని మోతీనగర్‌లో ఈ సంఘటన జరిగింది. వారిద్దరిని హత్య చేసిన ఆమె కూతురిపై దాడి చేసింది. తనను తాను గాయపరుచుకుంది.

వివరాలు ఇలా ఉన్నాయి - రీనా తనీజా (44) సుదేష్ కుమార్ (36) ఇంటికి వచ్చింది. తన భర్త మనోజ్‌తో ఆమెకు అక్రమ సంబంధం ఉందని అనుమానించి అలా వచ్చేసింది. మనోజ్ బిల్డర్‌గా పనిచేస్తున్నాడు. సుదేష్ భర్త అనిల్ కుమార్ ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికలో కార్పోరేట్ కమ్యూనికేషన్స్ చీఫ్‌గా పనిచేస్తన్నాడు.

సుధేష్ తనీజా వచ్చిన సమయంలో తన కుమారుడు ఆరవ్, కూతురితో ఇంట్లోనే ఉంది. సుదేష్ ఇంటికి తనీజా వచ్చిన వెంటనే ఘర్షణ ప్రారంభమైంది. వాదనలో అదుపు తప్పి సుదేష్ తనీజాపై పదునైన ఆయుధంతో దాడి చేసింది. ఆ తర్వాత ఆమె తన మూడేళ్ల కుమారు ఆరవ్‌పై దాడి చేసింది. 17 ఏళ్ల కూతురు కోమల్‌పై కూడా దాడి చేసింది.

తాను మరణించిన తర్వాత చూసేవారు ఉండరనే ఉద్దేశంతో సుధేష్ తన పిల్లలను కూడా చంపాలని అనుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు ఇరుగుపొరుగువారు అది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చే సరికి తనీజా, ఆరవ్ మరణించి పడి ఉన్నారు. సుధేష్ ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆచార్యశ్రీ భిక్షు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+