Nurse: దంపతుల మద్య ఆఒక్కటే సమస్య, పిల్లలకు విషం పెట్టి చంపేసి నర్సు ఏం చేసిందంటే ?

బెంగళూరు/మండ్య: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త సొంతంగా కారు గ్యారేజ్ నిర్వహిస్తున్నాడు. భార్య ఆసుపత్రిలో నర్సుగా ఉద్యోగం చేస్తోంది. పెద్దలు చేసిన పెళ్లి కావడంతో దంపతుల ఇరువైపుల కుటుంబ సభ్యులు వారి ఇంటికి వచ్చి వెలుతున్నారు. ఇటీవల దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. ఉదయం భర్త కారు గ్యారేజ్ దగ్గరకు వెళ్లాడు. ఆసుపత్రిలో పని ముగించుకుని ఇంటికి వెళ్లిన నర్సు ముగ్గురు పిల్లలకు విషయం పెట్టి చంపేసింది. బెడ్ రూమ్ లోని మంచం మీద ముగ్గురు పిల్లల శవాలు పడుకోపెట్టి అదే రూమ్ లో నర్సు ఉరి వేసుకుంది.

దంపతుల హ్యాపీలైఫ్

దంపతుల హ్యాపీలైఫ్

కర్ణాటకలోని మండ్య జిల్లాలోని మద్దూరు పట్టణం (బెంగళూరు-మైసూరు హైవేలో)లోని హోళేవీధిలో అఖిల్ అహమ్మద్, ఉష్నా కౌసర్ దంపతులు నివాసం ఉంటున్నారు. 9 సంవత్సరాల క్రితం అహమ్మద్, కౌసర్ కు వివాహం అయ్యంది, అహమ్మద్, కౌసర్ దంపతులకు హారిస్ (7), ఆలీసా (4), ఆనమ్ పాతిమా (2) అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు.

భర్త మెకానిక్.... భార్య నర్సు

భర్త మెకానిక్.... భార్య నర్సు

మద్దూరులోనే అహమ్మద్ సొంతంగా కారు గ్యారేజ్ పెట్టుకుని మెకానిక్ గా పని చేస్తున్నాడు. మద్దూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కౌసర్ నర్సుగా ఉద్యోగం చేస్తోంది. ప్రతిరోజు కౌసర్, అహమ్మద్ ఎవరిపనులకు వారు వెలుతున్నారు. పెద్దలు చేసిన పెళ్లి కావడంతో కౌసర్, అహమ్మద్ దంపతుల కుటుంబ సభ్యులు వారి ఇంటికి వచ్చి వెలుతున్నారు.

ఉద్యోగం చెయ్యకూడదని చెప్పిన భర్త

ఉద్యోగం చెయ్యకూడదని చెప్పిన భర్త

ఆసుపత్రిలో ఉద్యోగానికి వెళ్లకూదని అహమ్మద్ అతని భార్య కౌసర్ కు కొంతకాలంగా చెబుతున్నాడని తెలిసింది. అయితే తాను ఉద్యోగం చేస్తానని, తాను చదువుకున్నది ఉద్యోగం చెయ్యడానికే అని కౌసర్ ఆమె భర్తకు తేల్చి చెప్పింది. ఇటీవల కౌసర్, అహమ్మద్ దంపతుల మద్య ఇదే విషయంలో గొడవలు మొదలైనాయి.

ముగ్గురు పిల్లలకు విషం పెట్టి చంపేసి నర్సు ఆత్మహత్య

ముగ్గురు పిల్లలకు విషం పెట్టి చంపేసి నర్సు ఆత్మహత్య

ఉదయం అహమ్మద్ కారు గ్యారేజ్ దగ్గరకు వెళ్లాడు. తరువాత కౌసర్ కూడా ఆసుపత్రికి వెళ్లింది. పిల్లలను కౌసర్ బందువు అయిన మహిళ చూసుకుంటున్నది. సాయంత్రం ఆసుపత్రిలో డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లిన నర్సు కౌసర్ కొంతసేపు పిల్లలతో గడిపింది. తరువాత ముగ్గురు పిల్లలకు విషయం పెట్టి చంపేసింది. బెడ్ రూమ్ లోని మంచం మీద ముగ్గురు పిల్లల శవాలు పడుకోపెట్టిన కౌసర్ అదే రూమ్ లో నర్సు ఆత్మహత్య చేసుకుంది.

ఆవేశంలో ఎంతపని చేసింది ?

ఆవేశంలో ఎంతపని చేసింది ?

రాత్రి ఇంటికి వెళ్లిన అహమ్మద్ విషయం గుర్తించి ఆర్తనాదాలు చేశాడు. ఒకేసారి ముగ్గురు పిల్లలను హత్య చేసిన కౌసర్ ఆత్మహత్య చేసుకోవడంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు హడలిపోయారు. ఆవేశంలో కౌసర్ ఆమె ముగ్గురు పిల్లలను హత్య చేసి ఆమె ఆత్మహత్య చేసుకుందని మద్దూరు పోలీసులు అంటున్నారు. తన భార్య కౌసర్ ను తాను ఏమీ అనలేదని, చిన్న విషయానికి ముగ్గురు పిల్లలను హత్య చేసి ఆమె ఆత్మహత్య చేసుకుందని, నా జీవితం నాశనం అయ్యిందని అహమ్మద్ విలపిస్తున్నాడు. అయితే పోలీసులు అహమ్మద్ ను విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+