ఇదీ నా బలం!: కదిలిన పన్నీరుసెల్వం, కీలక ఎన్నికలకు ముందు...

మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే నేత పన్నీరుసెల్వం శుక్రవారం నాడు రాష్ట్రవ్యాప్త పర్యటనను ప్రారంభించారు.

చెన్నై: మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే నేత పన్నీరుసెల్వం శుక్రవారం నాడు రాష్ట్రవ్యాప్త పర్యటనను ప్రారంభించారు. ముఖ్యమంత్రి పళనిస్వామి వర్గం, పన్నీరు వర్గాలు కలిసే అంశంపైచాలా రోజులు చర్చలు సాగిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ టూర్ నేపథ్యంలో పొత్తు తేలిపోయిందని అర్థమైంది.

చదవండి: భర్తపై ఊగిపోయిన శశికళ

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో పన్నీరు నెల రోజుల రాష్ట్రవ్యాప్త పర్యటనను ఆరంభించారు. టూర్ ప్రారంభానికి ముందు పన్నీరు కాంచీపురంలో చేసిన ప్రసంగ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చారు.

శశికళ వర్గానికి తన బలం చెప్పేందుకు

శశికళ వర్గానికి తన బలం చెప్పేందుకు

ఈ పర్యటన ద్వారా తమ బలాన్ని, బలగాన్ని పెంచుకునే ప్రయత్నాలు పన్నీరు వర్గం చేస్తోంది. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ లేదా సీఎం పళనిస్వామికి.. పార్టీ మద్దతు తమకే ఉందని ఈ పర్యటన ద్వారా పన్నీరుసెల్వం చెప్పదలుచుకున్నారు.

చర్చలు జరిగినా..

చర్చలు జరిగినా..

ఈ పర్యటనలో పన్నీరుసెల్వం.. పళనిస్వామి వర్గంతో జరిగిన కలిసిపోయే అంశానికి సంబంధించిన వివరాలను కూడా వెల్లడించనున్నారని తెలుస్తోంది. తమ డిమాండ్లకు పళని వర్గం ఆమోదించలేదని, అందుకే వెనక్కి తగ్గినట్లు చెప్పనున్నారని తెలుస్తోంది. కలిసే అంశంపై ఇరువర్గాలు రెండు కమిటీలను ఏర్పాటు చేశాయి. కానీ ఈ కమిటీలు ఫేస్ టు పేస్ మాట్లాడుకున్నది లేదు. అయితే బ్యాక్ డోర్ ద్వారా మాత్రం చర్చలు జోరుగా సాగాయి.

డిమాండ్ల వారలా.. వీరు ఇలా..

డిమాండ్ల వారలా.. వీరు ఇలా..

ఓ వైపు పన్నీరుసెల్వం వర్గం రెండు వర్గాలు కలిసేందుకు పలు డిమాండ్లు ముందుంచింది. అదే సమయంలో పళనిస్వామి వర్గం మాత్రం డిమాండ్లపై మరో రకంగా స్పందించింది.అయితే, డిమాండ్ల విషయంలోనే ఇరువర్గాల మధ్య చర్చలు బెడిసి కొట్టాయనే వాదనలు ఉన్నాయి. పన్నీరు వర్గం బహిరంగంగా చెప్పే డిమాండ్లకు, అంతర్గత చర్చల్లో చెప్పే డిమాండ్లకు పోలిక లేదని, అమలు చేయలేని డిమాండ్లు పెట్టారనేది పళని వర్గం వాదన. ఆ తర్వాత చర్చలు కొలిక్కి రాకుండానే ముగిసాయి.

ప్రజల మద్దతు నాకేనని..

ప్రజల మద్దతు నాకేనని..

ఇరువర్గాల మధ్య చర్చలకు తెరపడిన నేపథ్యంలో పన్నీరుసెల్వం రాష్ట్రవ్యాప్త పర్యటనకు సిద్ధమయ్యారు. జయలలిత ఆశీస్సులతో పార్టీ, ప్రజల మద్దతు తనకే ఉందని చెప్పాలని పన్నీరు భావిస్తున్నారు. మరోవైపు పళనిస్వామి పార్టీకి చెందిన జిల్లా సెక్రటరీలతో మాట్లాడారు.

అందరికీ ఈ ఎన్నికలు కీలకం

అందరికీ ఈ ఎన్నికలు కీలకం

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటం కూడా గమనార్హం. ఈ ఎన్నికలు ప్రస్తుతం తమిళనాడులోని అధికార పార్టీలోని పళనిస్వామి, పన్నీరుసెల్వం వర్గాలకు, అలాగే ప్రతిపక్ష డీఎంకేకు చాలా కీలకం. ఈ ఎన్నికల ఫలితాలు వచ్చాక.. అన్నాడీఎంకేలోని రెండు వర్గాల్లో పార్టీ క్యాడర్ ఎవరి వైపు ఉందో తేలుతుందని అంటున్నారు. అదే సమయంలో అన్నాడీఎంకేలోని విభేదాలను డీఎంకేకు లాభించిందా లేదా కూడా ఈ ఎన్నికలు తేల్చనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+