అవకాశమివ్వండి: గవర్నర్‌ను కలిసిన పన్నీరు, శశికళకు వాయిదాతో ఝలక్
అన్నాడీఎంకే పంచాయతీ రాజ్ భవన్ చేరుకుంది. పలువురు సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలతో కలిసి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం గురువారం సాయంత్రం ఐదు గంటలకు ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర రావును కలిశారు.
చెన్నై: అన్నాడీఎంకే పంచాయతీ రాజ్ భవన్ చేరుకుంది. పలువురు సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలతో కలిసి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం గురువారం సాయంత్రం ఐదు గంటలకు ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర రావును కలిశారు.
ఇరువురు ఇరవై నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తనకు ఎమ్మెల్యేల బలం ఉందని, తనకు బలం నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని పన్నీరు ఇంచార్జ్ గవర్నర్‌ను కోరారు. మెజార్టీ ఎమ్మెల్యేలు తన వెంటే ఉన్నారని చెప్పారు.
బలవంతంగా రాజీనామా చేయించారు
గవర్నర్‌ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు అమ్మ ఆశీర్వాదం ఉందని చెప్పారు. మెజార్టీ ఎమ్మెల్యేలు తన వెంటే ఉన్నారని చెప్పారు. మంచే జరుగుతుందని, ధర్మం గెలుస్తుందన్నారు. నాతో బలవంతంగా రాజీనామా చేయించారని చెప్పారు. బల నిరూపణకు అవకాశమివ్వాలని కోరానని చెప్పారు. రాజీనామా విత్ డ్రా చేసుకునే అవకాశమివ్వమని అడిగానన్నారు.
మధుసూదన్‌తో పాటు కలిసి తాను గవర్నర్‌కు అన్ని విషయాలను వివరించామని చెప్పారు. రాష్ట్రంలోని పరిస్థితులను వివరించామని అన్నారు. తనకు మద్దతు పలుకుతున్న ఎమ్మెల్యేలు అందరికీ కృతజ్ఞతలు అని చెప్పారు.
ఎక్కువ మంది ఎమ్మెల్యేలు శశికళ వైపు ఉన్నప్పటికీ.. తనకు బలం నిరూపించుకునే అవకాశమివ్వామని పన్నీరు కోరడంపై చర్చ సాగుతోంది. ఆయనకు డీఎంకే మద్దతు ఇస్తుుందా? మరేమైనా జరుగుతుందా అనే చర్చ సాగుతోంది.

సీనియర్ నేతలు ఈ మధుసూదన్, పిహెచ్ పాండియన్, కేపీ మునుస్వామి, నాథమ్ విశ్వనాధన్ తదితరులతో కలిసి పన్నీరు సెల్వం గవర్నర్‌ను కలిశారు. ఇరవై నిమిషాల భేటీ అనంతరం రాజ్ భవన్ నుంచి వెళ్లిపోయారు. శశికళ రాత్రి ఏడు గంటలకు కలవనున్నారు.
శశికళ ప్రమాణ స్వీకారం వాయిదా వేస్తారా?
శశికళకు ఎక్కువ మంది ఎమ్మెల్యేల బలం ఉండటం, పన్నీరు సెల్వం పట్టు కోసం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో.. ఇప్పుడు గవర్నర్ ఏం చేస్తారనే చర్చ సాగుతోంది.
ఒక్కరొక్కరుగా ఎమ్మెల్యేలు శశికళను వీడుతున్నారు. ఇది శశికళకు ఇబ్బందికరమే అంటున్నారు. మెజార్టీ ఎమ్మెల్యేలు ఆమెను వీడే దాకా శశికళ ప్రమాణ స్వీకారాన్ని గవర్నర్ వాయిదా వేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications