వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిపబ్లిక్ వేడుకలు: చూయింగ్ గమ్ నములుతూ ఒబామా, వివరిస్తున్న మోడీ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 66వ గణతంత్ర వేడుకలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరయ్యారు. ఈ వేడుకల్లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వేడుకలు చూస్తూ చూయింగ్ గమ్ నములుతూ కనిపించారు.

వేడుకల్లో భాగంగా భారత సైనిక దళాలు తమ పాటవాన్ని ప్రదర్శిస్తున్నాయి. మరోవైపు హెలికాప్టర్ల నుంచి పూలవర్షం కురుస్తోంది. ఐతే ముఖ్య అతిథిగా హాజరైన అమెరికా అధ్యక్షుడు ఒబామా మాత్రం చూయింగ్ గమ్ నములుుతున్నారు.

Obama caught on camera popping chewing gum back into mouth

శకటాల ప్రదర్శన సమయంలో వేడుకలు చూస్తు చూయింగ్ నములుతూ... మధ్యమధ్యలో దాన్ని బయటకు తీసి, మళ్లీ నోట్లోకి పెట్టుకుంటూ మీడియా కంట పడ్డారు. ఇక ప్రధాని నరేంద్రమోడీ మాత్రం రంగు రంగుల తలపాగా ధరించి నల్లటి సూట్‌లో వచ్చిన ఒబామా పక్కనే కూర్చుని శకటాల విశిష్టతలతో పాటు, భారత్ అంబుల పొదిలోని యుద్ధ ట్యాంకర్లు గురించి ఒబామాకు వివరిస్తున్నారు.

గతంలో కూడా బీజింగ్‌లో జరిగిన ఆసియా ఫసిపిక్ ఆర్ధిక సమితి (అపెక్) సమావేశాల సమయంలో కూడా ఒబామా ఇదే తరహాలో చూయింగ్ గమ్ నములుతూ కనిపించడంతో సోషల్ మీడియాలో పెద్ద వివాదం చెలరేగింది.

ఆ సదస్సులో పలు సందర్భాల్లో అమెరికా అధ్యక్షుడు చ్యూయింగ్ గమ్ నములుతూ, తీస్తూ కనిపించారని, సదస్సుకు వచ్చేటప్పుడు కూడా అలాగే చేశారని ఇంగ్లండ్ పత్రిక 'ద ఇండిపెండెంట్' అప్పట్లో విమర్శిస్తూ పెద్ద ఆర్టికల్స్ రాసింది.

English summary
President Brack Obama, the chief guest of the Republic Day celebrations, was caught on camera, removing his chewing gum, and then popping it back into his mouth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X