హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

న్యాయం చేయండి:: ప్రధాని మోడీని కలిసిన విహెచ్, దత్తన్న(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఓబీసీల అభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ఓబీసీ ఎంపీల బృందం ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. ఓబీసీ ఎంపీల ఫోరం కన్వీనర్, కాంగ్రెస్ ఎంపీ వి. హనుమంతురావు నేతృత్వంలో సుమారు 50 మంది ఓబీసీ ఎంపీలు బుధవారం పార్లమెంట్ కార్యాలయంలో ప్రధాని మోడీని కలిశారు.

ఓబీసీల అభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, జాతీయ వెనకబడిన తరగతుల కమిషన్ (ఎన్‌సీబీసీ)కు రాజ్యాంగ బద్ధమైన అధికారం కల్పించాలని 85 మంది ఎంపీల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు.

 ప్రధాని మోడీని కలిసిన ఓబీసీ ఎంపీలు

ప్రధాని మోడీని కలిసిన ఓబీసీ ఎంపీలు

కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, రాంక్రిపాల్ యాదవ్, ఉపేంద్ర కుష్‌వాహతో పాటు ఎపీ, తెలంగాణకు చెందిన ఎంపీలు ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. దేశంలోని 60 శాతం ఉన్న ఓబీసీల్లో 50 శాతం మంది పేదిరికంలో నివసిస్తున్నారని వివరించారు.

 ప్రధాని మోడీని కలిసిన ఓబీసీ ఎంపీలు

ప్రధాని మోడీని కలిసిన ఓబీసీ ఎంపీలు

బీసీకి చెందిన వ్యక్తి ప్రధాని కావడంతో తమ సమస్యలు తీరుతాయని ఆశలు పెట్టుకున్నామని చెప్పారు. ప్రస్తుతం జాతీయ వెనకబడిన తరగతుల కమిషన్ (ఎన్‌సీబీసీ)కి ఉన్న అధికారులు చాలా పరిమితమైనవని, అవి ఎంత మాత్రం సరిపోవని తెలిపారు.

 ప్రధాని మోడీని కలిసిన ఓబీసీ ఎంపీలు

ప్రధాని మోడీని కలిసిన ఓబీసీ ఎంపీలు

జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ తరహాలో జాతీయ వెనకబడిన తరగతుల కమిషన్ (ఎన్‌సీబీసీ)కు అధికారులు కల్పించాలని ప్రధాని మోడీని కోరారు.

ప్రధాని మోడీని కలిసిన ఓబీసీ ఎంపీలు

ప్రధాని మోడీని కలిసిన ఓబీసీ ఎంపీలు


కొన్ని ప్రభుత్వ రంగాల్లో జరిగే నియామకాల్లో రోస్టర్ పద్ధతిని సరిగా పాటించడం లేదని, ఓబీసీ కేటగిరిలో మిగిలిపోయిన బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయడం లేదని ప్రధానికి వివరించారు.

English summary
OBC MPs meet PM, raises issue of caste in census on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X