వివాహితతో కలిసి స్వామిజీ.. ఏకాంతంగా పూజ చేస్తుండగా.. పేలుడు

శాస్త్ర, సాంకేతిక రంగంలో ఎంత అభివృద్ధి చెందిన సరే మూఢనమ్మకాలను మాత్రం వీడటం లేదు. ఎక్కడో జరిగిన క్షుద్రపూజల గురించి ప్రతీరోజు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా తమిళనాడులో క్షుద్రపూజలు చేస్తున్నారనే విషయం ప్రపంచానికి తెలిసింది. అయితే ఇక్కడ పేలుడు జరిగింది. దీంతో క్షుద్రపూజల వ్యవహారం బయటకు పొక్కింది. లేదంటే గుంభనంగా పూజలు చేసుకుంటూ ఉండేవారు.

ఇదీ నేపథ్యం

ఇదీ నేపథ్యం

తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా ఎరయమంగళంలో గోవిందరాజ్ అనే స్వామిజీ ఉంటున్నాడు. గోవిందరాజ్ స్వస్థలం నంగనల్లూరు కాగా.. కానీ 15 ఏళ్ల క్రితం ఎరయమంగళం వచ్చి స్థిరపడ్డాడు. అంతకుముందు చెన్నై, తిరువళ్లూరులో కూడా జ్యోతిష్యం చెప్పాడు. తర్వాత ఎరయమంగళానికి మకాం మార్చాడు. ఊరి చివరలో ఎకరం భూమి కొనుగోలు చేసి అక్కడే ఉంటున్నాడు. ఎరయమంగళం, సమీప గ్రామ ప్రజలకు జ్యోతిష్యం చెప్తుంటాడు. దీంతోపాటు క్షుద్రపూజలు కూడా చేస్తాడు. అలాగే బుధవారం కూడా ఓ వివాహిత కోసం క్షుద్రపూజలు చేశాడు.

స్వామిజీని ఆశ్రయించి

స్వామిజీని ఆశ్రయించి

15 రోజుల క్రితం స్వామిజీ గోవిందరాజ్ వద్దకు లావణ్య వచ్చారు. ఆమె అక్కడే ఉన్నట్టు తెలుస్తోంది. బుధవారం రాత్రి క్షుద్రపూజల కోసం ఏర్పాట్లు చేశారు. రాత్రి 9 గంటల సమయంలో క్షుద్రపూజలను స్వామిజీ ప్రారంభించాడు. అయితే పక్క గదిలో లావణ్య ఉన్నట్టు తెలుస్తోంది. స్వామిజీ పూజలు చేస్తుండగానే పేలుడు సంభవించింది. పేలుడు ఎందుకు సంభవించిందనే అంశంపై స్పష్టత రాలేదు. ఆమె బయటకొచ్చి చూసేవరకు స్వామిజీ మంటల్లో కాలిపోతున్నాడు. వెంటనే ఆమె అరవగా చుట్టుపక్కల వారు వచ్చారు.

సజీవ దహనం

సజీవ దహనం

మంటల్లో కాలిన స్వామిజీ గోవిందరాజ్ సజీవ దహనమయ్యాడు. స్వామిజీ చనిపోవడం స్థానికంగా కలకలం రేపింది. పేలుడుపై లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. గోవిందరాజ్ మృతదేహన్ని తిరువళ్లూరు ఆస్పత్రికి తరలించారు. మరోవైపు గోవిందరాజు ఇంట్లో పేలుడు జరిగిన స్థలాన్ని ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించారు. అక్కడ ఆధారాలను సేకరించారు. గోవిందరాజ్ క్షుద్రపూజలు చేశాడని ప్రాథమిక విచారణలో నిర్ధారించారు.

లావణ్య ఎవరు ?

లావణ్య ఎవరు ?

వివాహిత లావణ్య ఎవరు ? ఆమె ఎందుకు అక్కడికి వచ్చారనే అంశంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒకవేళ క్షుద్రపూజలు చేస్తే, ఆమె స్వామిజీతో ఎందుకు లేదు అనే ప్రశ్న తలెత్తుతుంది. పేలుడు ఎలా జరిగింది. పూజకు ఉపయోగించే వస్తువుల్లో పేలుడు పదార్థాలు ఉన్నాయా అనే అంశంపై ఫోరెన్సిక్ నిపుణులు పరిశోధిస్తున్నారు. ఫోరెన్సిక్ టీం పరిశీలన, పోలీసుల విచారణతో స్వామిజీ మృతికి గల కారణం తెలిసే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+