దారుణం: మూఢనమ్మకంతో బాలుడి నాలుక చీల్చి బలి
బలంగీర్: ఒడిశా రాష్ట్రంలోని బలంగీర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తనను దుష్టశక్తులు అవహించాయన్న మూఢనమ్మకంతో ఓ ప్రబుధ్దుడు.. ఏడేళ్ల బాలుడి నాలుక చీల్చి, బలి పేరుతో అతని ప్రాణాలు తీశాడు.
శనివారం గంధ్రాబాద్‌లోని ఓ మడుగులో ఉన్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడు జిల్లాలోని జాలిపదర్ గ్రామానికి చెందిన దశరథ్‌గా గుర్తించారు.

హృషికేశ్ దాస్ అనే మాంత్రికుడి సూచనతో బన్‌కనే బెహరా ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు.
తన ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలుడ్ని నిందితులు శుక్రవారం అపహరించి బలి ఇచ్చారని పోలీసులు తెలిపారు.
మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. హృషికేశ్ దాస్, బనకనే బెహెరాలతోపాటు మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణలో బాలుడ్ని హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications