నా భర్తకు మరో స్త్రీతో సంబంధం: ఐఏఎస్ ఆఫీసర్ భార్య
ఒడిశా: తన భర్త తనను వేధిస్తున్నాడంటూ ఓ ఐఏఎస్ అధికారి భార్య మహిళా కమిషన్‌ను ఆశ్రయించిన సంఘటన ఒడిశా రాష్ట్రంలో జరిగింది. అదనపు చీఫ్ సెక్రెటరీ భార్య తన భర్త మీద పై ఆరోపణలు చేశారు.
తన భర్తకు ఢిల్లీకి చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని, దీని పైన తాను అడిగానని పేర్కొన్నారు. దీంతో తనను మానసికంగా తన భర్త వేధిస్తున్నాడని ఆమె ఆరోపించారు. తన భర్త వల్ల తనకు ప్రాణహాని ఉందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

గతంలోనూ, తన భర్త వేధిస్తున్నాడని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను ఆమె కలిశారు. అయితే, ఆయనను కలిసినా తనకు న్యాయం జరగలేదని ఆమె చెప్పారు.
దీనిపై మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్పందిస్తూ.. కేసులో అవసరమైన తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదిలా ఉండగా, ఈ విషయమై సదరు ఐఏఎస్ అధికారిని వివరణ అడగగా ఆయన స్పందించేందుకు నిరాకరించారు.












Click it and Unblock the Notifications