ప్రిన్సిపాల్ పోస్టు దక్కలేదని పార్శిల్ బాంబు: నవ వరుడు, నానమ్మ మృతి, వధువుకు తీవ్ర గాయాలు

భువనేశ్వర్: తనకు కాకుండా అదే కాలేజీలో పనిచేసే మహిళా లెక్చరర్‌కు ప్రిన్సిపాల్‌గా ప్రమోషన్ రావడంతో తట్టుకోలేక పార్శిల్ బాంబు పెట్టి ఇద్దరి మృతికి ఓ లెక్చరర్ కారణమయ్యాడు.ఈ ఘటనలో నవ వరుడు అతని నాయనమ్మ మృతి చెందారు. నవ వధువు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడు మెహర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో ఒడిశా రాష్ట్రంలోని బొలన్‌గిరిలో సౌమ్య, రీమా సాహులకు వివాహం జరిగింది. వరుడు సౌమ్య తల్లి సంజుక్త స్థానికంగా ఉన్న బికాశ్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తోంది.

Odisha Parcel Bomb Case: Police Say Lecturer Carried Out Parcel Blast, Jealousy Was Motive

కుమారుడి వివాహనికి ముందుగానే లెక్చరర్ నుండి ఆమెకు ప్రిన్సిఫాల్‌గా ప్రమోషన్ దక్కింది. అయితే ఈ కాలేజీకి ప్రిన్సిఫాల్ కావాలని భావించిన ఆమె తోటి లెక్చరర్ ఆ కుటుంబంపై కక్షగట్టాడు.సంజుక్త కుటుంబాన్ని అంతం చేయాలని ప్లాన్ చేశారు. అయితే సంజుక్త తన కొడుకు వివాహనికి రావాలని మెహర్‌కు ఆహ్వనం పంపింది.

వివాహం జరిగి ఐదో రోజున మెహర్ నవ దంపతులకు గిఫ్ట్‌ను పార్శిల్‌లో పంపాడు. అయితే ఈ పార్శిల్‌లో బాంబు ఉందని తెలియని సౌమ్య , అతడి నానమ్మ ఈ పార్శిల్‌ను విప్పారు.

ఈ పార్శిల్‌లో ఓపెన్ చేయగానే బాంబు పేలిపోయింది. దీంతో నవ వరుడు సామ్య, అతడి నానమ్మ తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. వీరికి సమీపంలోనే ఉన్న నవ వధువు రీమాకు కూడ గాయాలయ్యాయి.

ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ కేసుకు సంబంధించిన ఎట్టకేలకు పోలీసులు నిందితుడిని గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+