జపాన్ నుంచి డిజిటల్ కేబినెట్ మీట్: గవర్నెన్స్‌లో ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ మార్క్
భువనేశ్వర్: ఒడిషా ప్రభుత్వం తొలిసారిగా డిజిటల్ కేబినెట్ మీటింగ్ విజయవంతంగా నిర్వహించింది. ఒడిషాలో పెద్ద ఎత్తున్న పెట్టుబడులను ఆకర్షించేందుకు జపాన్ పర్యటనలో ఉన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ డిజిటల్ పద్ధతిలో కేబినెట్ మీటింగ్ నిర్వహించి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు.
జపాన్ దేశంలోని క్యోటో నగరంలో ప్రస్తుతం ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ ఉన్నారు. ఒడిషా రాష్ట్రం నుంచి క్యోటో నగరం 6వేల కిలో మీటర్ల దూరంలో ఉంది. అయితే నవీన్ పట్నాయక్ కేబినెట్‌లోని మంత్రులంతా ఓ ప్రత్యేక వేదికపై ఒడిషా నుంచి ఆన్‌లైన్‌లో కేబినెట్ మీటింగ్‌లో పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఒక ముఖ్యమంత్రి విదేశీ గడ్డపై నుంచి డిజిటల్ పద్దతిలో కేబినెట్ మీటింగ్ నిర్వహించి ఫైల్స్ డాక్యుమెంట్లపై కూడా ఆమోదముద్ర వేస్తూ పెట్టే సంతకం కూడా డిజిటల్‌లోనే జరగడం ఇది తొలిసారి. ఈ డిజిటల్ కేబినెట్ మీటింగ్‌కు ఒడిషా స్టేట్ వైడ్ ఏరియా నెట్‌వర్క్ (OSWAN)ను వినియోగించారు.

Speaking on the first Digital Cabinet, CM said that #Odisha has always been a pioneer in leveraging latest technology to improve effectiveness of the governance systems and delivery of public services. Technology now allows governance on the go, CM added. pic.twitter.com/APXED5A2Yy
— CMO Odisha (@CMO_Odisha) April 9, 2023
ప్రజా వ్యవస్థలో పలు ప్రజా సేవలు ప్రజలకు అందండంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందని సీఎం పట్నాయక్ చెప్పారు. ప్రభుత్వ వ్యవస్థలో టెక్నాలజీ మరింత వృద్ధి చెందడంతో భౌతిక ఉనికితో సంబంధం లేకుండా పనులు జరిగిపోతున్నాయని సీఎం అన్నారు. ఈ క్రమంలోనే పాలనను వేగవంతం చేసేందుకు డిజిటల్ పద్ధతిలో కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఓస్వాన్ (OSWAN) అనే వేదిక ఒడిషా ఐటీశాఖకు వెన్నెముకగా వ్యవహరిస్తోంది. డేటా, వీడియో, వాయిస్ ట్రాఫిక్‌లు, ఇంటర్/ఇంట్రా డిపార్ట్‌మెంటల్ కమ్యూనికేషన్, డేటా షేరింగ్ వంటివాటిని ఈ ప్లాట్‌ఫాం సులభతరం చేస్తోంది. అంతేకాదు ఒడిషా ప్రభుత్వం ఏదైనా ప్రాజెక్టులు చేపడితే అధికారులకు కావాల్సిన డాక్యుమెంట్లు, ఫీడ్‌బ్యాక్‌లు ఇవ్వడమే కాకుండా రియల్‌టైమ్‌లో జరుగుతున్న మార్పులను కూడా ట్రాక్ చేసేలా ఓస్వాన్ ఉపయోగపడుతోంది.












Click it and Unblock the Notifications