వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగాల్ నుండి ఒడిశాకు చేరిన రసగుల్ల... ఎందుకు..?

|
Google Oneindia TeluguNews

రసగుల్ల పేరు చెబితే ఎవ్వరికైన నోరూరక తప్పదు, వాటిని చూసిన తర్వాత తినేవరకు మనస్సు ఆగదు. మరి ఇంతలా నోరూరించే రసగుల్లాలు ఏప్రాంతానికి చెందినవి, వీటీనీ తయారు చేసి ప్రజలకు రుచి చూపించిన రాష్ట్ర ప్రజలు ఎవరు..? అనే సందేహాలు రావాల్సిన అవసరముంది. అయితే ఏ వస్తువు ఏప్రాంతానికి చెందిందో, తిను బండారం ఎక్కడి నుండి వచ్చిందో తెలిపేందుకు జీయోగ్రాఫికల్ ఇండికేషన్ చూస్తే తెలిసిపోతుంది.

రాష్ట్రానికో వస్తువు, కొన్ని వస్తువులతో ఆయా రాష్ట్రాలకు గుర్తింపు కూడ వస్తుంది. దీంతో ఆ వస్తువు మూలాలు ఆయా రాష్ట్రానికి చెందిన వస్తువులుగా ప్రపంచం ద‌ృష్టిలో నిలిచిపోతుంది. ఈనేపథ్యంలోనే ఇన్నాళ్లు పశ్చిమ బెంగాల్‌‌కు చెందిన రసగుల్లాలు ఇప్పుడు ఓరిస్సాకు చెందినవిగా గుర్తింపు పోందాయి. రసగుల్ల కోసం రెండు రాష్ట్రాల మధ్య జరగిన పోరాటంలో చివరికి ఒరిస్సా విజయం సాధించింది. దీంతో బెంగాల్‌ నుండి రసగుల్ల తీపీ మాయమైంది.

odisha Rasgulla received GI tag

కాగా జీఐ నాణ్యత, పేరుప్రఖ్యాతలు ఉన్న ఆయా వస్తువులను వాటి మూలాలను బట్టి ఆయా ప్రాంతాలకు చెందినవని నిర్ధారిస్తూ జీఐ చిహ్నాలను మంజూరు చేస్తుంటారు. వీటీని వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌లో సభ్యదేశమైన భారత్‌లో 2003 నుంచి ఈ చిహ్నాలను ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రసగుల్లా మా రాష్ట్రానికి చెందిందంటూ 2015 నుంచి బెంగాల్‌, ఒడిశా రాష్ట్రాలు పోటీపడ్డాయి. చివరికి ఈ పోరాటంలో బెంగాల్‌ పైచేయి సాధించింది. దీంతో రసగుల్లా బెంగాల్ రాష్ట్రానిదేనంటూ 2017 నవంబర్‌లో అంతర్జాతీయ గుర్తింపును పొందింది.

అయితే దీనిపై మరోసారి ఒడిశా ప్రభుత్వం పోరాటానికి దిగింది. రసగుల్ల తమదే అంటూ సరైన ఆధారాలు సమర్పించింది. దీంతో ఒడిశా రసగుల్లా పేరిట జీఐ ట్యాగ్‌ను జారీ చేసింది.ఇక ఈ సర్టిఫికెట్‌ 2028 ఫిబ్రవరి 22 వరకు కొనసాగనుంది. ఒడిశా రసగుల్లాగా జీఐ ట్యాగ్‌ రావడంతో ఆ రాష్ట్ర వాసులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.

English summary
odisha received official recognition for its Odisha rasagola from GI of india.odisha moved the GI registry for GI tag its own version of rasagola ofter west bengal was awrded the GI tag
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X