Odisha train accident: ప్రమాదంపై విచారణ, ముమ్మరంగా సహాయక చర్యలు - రైల్వే మంత్రి..!!
ఒడిశా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 237 మందిని గుర్తించినట్లు అధికారికంగా ప్రకటించారు. ఘటనా స్థలికి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చేరుకున్నారు. ప్రమాదం పై దర్యాప్తు కు హై లెవల్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రైలు ప్రమాదంలో మరో 900 మందికిపైగా తీవ్రగాయాలు అయ్యాయి. మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ రూ. 10 లక్షల పరిహారం ప్రకటించింది. రైల్వే అధికారులు, ఆర్మీ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. బాధితులను ఆస్పత్రులకు చేరవేసేందుకు హెలికాఫ్టర్లు వినియోగిస్తున్నారు.
పెరుగుతున్న మృతుల సంఖ్య: ఒడిశా రైలు ప్రమాదం తో ఒక్క సారిగా విషాదం నెలకొంది. ఈ ఘోర ప్రయాదంలో అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 237 మంది ప్రాణాలు కోల్పోయారు. వెయ్యి మందికి పైగా గాయాల బారిన పడ్డారు. క్షత గాత్రుల బాధ వర్ణాణాతీతం. బాధితులను సమీపంలోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు.
ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తో పాటుగా సైన్యం సేవలను వినియోగిస్తున్నారు. క్షతగాత్రులను తరలిచేందుకు ప్రత్యేకంగా హెలికాఫ్టర్లను సిద్దం చేసారు. ప్రమాదంపై ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి ప్రకటించారు. ఇవాళ రాష్ట్ర వేడుకలను రద్దు చేసిన ఒడిశా సర్కార్ ..ఒక రోజు సంతాప దినంగా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందించనుంది.

ఘటనా స్థలిలో రైల్వే మంత్రి: ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పరిశీలిస్తున్నారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. రైలు ప్రమాద ఘటన చాలా బాధాకరమన్నారు. ప్రస్తుతం సహాయక చర్యలపై ఫోకస్ పెట్టామని చెప్పారు.
బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. దర్యాప్తుకు హైలెవర్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. విచారణ తర్వాతే ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయన్నారు. రైల్వే సేఫ్టీ కమిషన్ కూడా విచారణ చేస్తుందన్నారు. ముందుగా ప్రమాదంలో చిక్కుకున్న వారికి సహాయం అందిచటమే తమ లక్ష్యమని స్పష్టం చేసారు. బాధితులకు అన్నిరకాలుగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

సహాయక చర్యలు ముమ్మరం: ప్రమాదంలో నాలుగు రాష్ట్రాలకు చెందిన ప్రయాణీకులు ఉన్నారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఏపీ, తమిళనాడు కు చెందిన ప్రయాణీకులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో, ఈ నాలుగు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సహాయక చర్యల్లో అధికారులు భాగస్వాములు అవుతున్నారు. కోల్ కతా నుంచి అదనపు సహాయక సిబ్బందిని తరలించారు.
కాసేపట్లే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఘటనా స్థలికి చేరుకోనున్నారు. ఈ దశాబ్ద కాలంలో జరిగిన ఘోర ప్రమాదంగా రైల్వే శాఖ పేర్కొంది. మూడు రైళ్లు ప్రమాదానికి గురవ్వటం మానవ తప్పిదమా.. సిగ్నల్ వ్యవస్థలో లోపమా అనేది తేలాల్సి ఉంది. ఈ ఘటనలో అందుతున్న సహాయక చర్యలపైన ప్రధాని మోదీ ఆరా తీసారు.












Click it and Unblock the Notifications