కోరమండల్ లో పెద్ద సంఖ్యలో రాష్ట్ర ప్రయాణీకులు, హెల్ప్ లైన్..!!
ఒడిశాలోని బాలేశ్వర్ వద్ద ఘోర రైలు ప్రమాదం జరిగింది. మూడు రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి. ఇందులో ఇప్పటి వరకు అందుతున్న అధికారిక సమాచారం మేరకు 233 మంది మరణించారు. 900 మంది గాయాలపాలయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బెంగాల్‌లోని షాలీమార్ - చెన్నై సెంట్రల్ మధ్య నడిచే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ గి ఉన్న గూడ్స్ రైలును ఢీకొని పట్టాలు తప్పింది.
ఈ రైలు బోగీలు పక్కనే మరో ట్రాక్‌పై పడిపోయాయి. అదే సమయంలో అటువైపు నుంచి వచ్చిన బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఆ బోగీలను ఢీకొని పట్టాలు తప్పింది. ఈ రెండు రైళ్లోలనూ ఏపీ ప్రయాణీకులు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు రైల్వే అధికారుల వద్ద ఉన్న రిజర్వేషన్ జాబితాతో తెలుస్తోంది.

కోరమండల్ ఎక్స్ ప్రెస్ లో షాలిమార్, సంత్రగచ్చి, ఖరగ్ పూర్, బాలేశ్వర్ స్టేషన్లలో ఎక్కిన ప్రయాణీకుల్లో విజయవాడలో 47 మంది, రాజమహేంద్ర వరంలో 22 మంది, ఏలూరుకు ఒకరు కలిపి మొత్తంగా 70 మంది వరకు రిజర్వేషన్ చేయించుకున్నట్లు అధికారుల జాబితా వెల్లడిస్తోంది.
ఇదే రైలులో రాజమహేంద్ర వరం స్టేషన్ నుంచి 56 మంది, తాడేపల్లిగూడెంలో 10 మంది, ఏలూరులో 44 మంది, విజయవాడలో 120 మంది ప్రయాణీకులు ఎక్కి చెన్నై స్టేషన్ కు వెళ్లేలా రిజర్వేషన్ చేయించుకున్నారు. అదే విధంగా యశ్వంత్ పూర్ నుంచి హౌరా వెళ్తున్న రైళ్లో తిరుపతి, రేణిగుంట, చీరాల స్టేషన్ల నుంచి ఖరగ్ పూర్, హౌరా వైపు 52 మంది ప్రయాణీకులు వెళ్లినట్లు రైల్వే ఛార్ట్ కు అనుగుణంగా సమాచారం అందుతోంది.

కర్ణాటకలోని యశ్వంత్ పూర్ నుంచి హౌరా వెళ్తున్న ఈ రైలులో తిరుపతి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, విజయవాడ, ఏలూరు, తాడేపల్లి గూడెం, రాజమహేంద్ర పురం, సామర్లకోట, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస స్టేషన్ల మీదుగా వెళ్లింది. రిజర్వేషన్ చేయించుకోకుండా సాధారణంగా ప్రయాణించే వారు ఉంటారని చెబుతున్నారు.
ఒడిశా రైలు ప్రమాదంలో దక్షిణ మధ్య రైల్వే హెల్ప్ లైన్లను ఏర్పాటు చేసింది. విజయవాడ (0866 2576924), రాజమండ్రి (0883 2420541), రేణిగుంట(9949198414), తిరుపతి రైల్వే స్టేషన్ (7815915571), నెల్లూరు రైల్వే స్టేషన్(08612342028) సహాయ కేంద్రాలకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చని రైల్వే అధికారులు ప్రకటించారు.












Click it and Unblock the Notifications