ఒడిశా రైలుప్రమాదం: రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజీనామా చేయాలి; కాంగ్రెస్, టీఎంసి డిమాండ్!!

ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనలో 278 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. నిన్న రాత్రి ఒడిశాలో చెన్నై కోరమండల్ ఎక్స్ ప్రెస్, బెంగళూరు హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొన్న ఘటన భారత రైల్వే చరిత్రలోనే అత్యంత విషాదకర, అతిపెద్ద రైలు ప్రమాద ఘటనగా మారింది.

వందల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్న ప్రతిపక్షపార్టీలు, మరోవైపు అధికార బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ ఘటనకు నైతికబాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మహారాష్ట్ర మాజీసీఎం పృథ్వీరాజ్ చవాన్ అశ్విని వైష్ణవ్ తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

odissatrainaccidentaswinivaishnawtmc

గతంలో రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ లాల్ బహదూర్ శాస్త్రి తన పదవికి రాజీనామా చేశారని గుర్తు చేశారు. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ అశ్విని వైష్ణవ్ కూడా తన పదవికి రాజీనామా చేయాలన్నారు. రైలు ప్రమాద ఘటనపై విచారణ జరిపించి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు.

విచారణ పేరుతో కాలయాపన చేయకుండా నిర్ణీత కాల వ్యవధిలో రైలు ప్రమాద ఘటనపై దర్యాప్తు కమిటీ నివేదికను సమర్పించేలా చూడాలని పృథ్వీరాజ్ చవాన్ డిమాండ్ చేశారు.మరోవైపు పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కూడా రైలు ప్రమాదానికి సంబంధించి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు.

ప్రతిపక్ష నాయకులపై గూఢచర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సాఫ్ట్వేర్లను కొనుగోలు చేయడానికి కోట్లాది రూపాయలను ఖర్చు పెడుతుందని, కానీ రైలు ప్రమాదాలను నివారించి, సామాన్యుల ప్రాణాలను కాపాడటానికి ఏమీ చెయ్యలేక పోతుందని టీఎంసి ఆరోపిస్తోంది. రైల్వే మంత్రికి మనస్సాక్షి ఉంటే తక్షణం రాజీనామా చేయాలని టీఎంసి నేత డిమాండ్ చేశారు.

వందే భారత్, కొత్తగా నిర్మించిన రైల్వే స్టేషన్ ల గురించి గొప్పగా చెబుతూ ప్రజల మద్దతు పొందడానికి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వ రాజకీయ ఎత్తుగడలు వేస్తోందని, కానీ భద్రతా చర్యల కోసం ఎలాంటి పని చేయడం లేదని విమర్శించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+