వామ్మో.. సీరియల్ చూస్తుండగా పేలిన టీవీ.. భార్య మృతి. భర్త, కూతురి పరిస్థితి విషమం... ఎక్కడో తెలుసా..
పండగ అని, ఫ్యామిలీతో ఉన్నామని.. కుటుంబం అంతా కలిసి టీవీ చూస్తున్నారా..? ఒక్కసారి వైర్ చెక్ చేసుకొండి. లూజ్ కనెక్షన్ ఉందేమో పరిశీలించండి. అంతా సవ్యంగా ఉంటేనే టీవీ ముందు వాలండి.. లేదంటే ఒడిశాలో జరిగినట్టుగానే మీ ఇంట్లో విషాదం జరిగే అవకాశం ఉంది. పచ్చని కాపురంలో షార్ట్ సర్క్యూట్ లాంటి ప్రమాదం విషాదం నింపే ప్రమాదం పొంచి ఉంది.

పచ్చని కాపురంలో..
ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లా ధురుహాదిహి పోలీసుస్టేషన్ పరిధిలో గల లాహందబుడాలో దిల్వేశ్వర్ నాయక్ ఫ్యామిలీ ఉంటోంది. ఇతనికి భార్య బాబీ నాయక్, ఆరునెలల కూతురు ఉన్నారు. శుక్రవారం శివరాత్రి పర్వదినం సందర్భంగా ఇంట్లో పనులు చేసి బిజీగా ఉన్నారు. సాయంత్రం అలా టీవీ ముందు వాలారు. అంతే కనురెప్పు తెరిచేలోపు విషాదం జరిగింది.

పేలిన టీవీ..
సాయంత్రం దిల్లేశ్వర్ భార్య, కూతురితోపాటు టీవీ ముందు కూర్చొన్నారు. సీరియల్ ఇంట్రెస్ట్‌గా చూస్తున్నారు. ఇంతలో టీవీ పేలిపోయింది. టీవీ అద్దాలు చెల్లాచెదురుగా వారిపై పడిపోయాయి. దీంతో వారు హాహాకారాలు చేశారు. బయటకు ఆరుపులు వినిపించడంతో వెంటనే స్థానికులు వచ్చారు. టీవీ పేలిందని తెలుసుకొని.. మెయిన్ స్విచ్ ఆఫ్ చేశారు. వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

భార్య మృతి..
108 వాహనంలో సుందర్‌బాగ్ ఆస్పత్రికి తరలించారు. కానీ గాజు ముక్కలు దిగి.. తీవ్రగాయాలైన వివాహిత చనిపోయారు. దిల్లేశ్వర్ నాయక్, అతని కూతురు మృత్యువుతో పోరాడుతున్నారు. వారి పరిస్థితి అంతకంతకు విషమించడంతో రూర్కెలాలోని ఇస్పాట్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారికి చికిత్స అందిస్తున్నారు. పండగ పూట భర్తతో పాటు టీవీ చూస్తున్న ఇల్లాలు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. భర్త, చిన్నారి మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ ఘటన వారి కుటుంబంలో పెను విషాదం నింపింది.












Click it and Unblock the Notifications