వస్తావా, ఇస్తావా: ఆఫీస్ లో బాస్ వేధింపులు
బెంగళూరు: ఉన్నత స్థాయి ఉద్యోగం చేస్తున్న మహిళ మీద తన కార్యాలయంలో పని చేస్తున్న అధికారి లైంగిక వేధింపులకు పాల్పడటంతో ఆమె కార్యాలయంలోనే ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కర్ణాటకలోని తుమకూరు పట్టణంలో జరిగింది.
తుమకూరులోని సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో ఓ మహిళ ఉన్నత స్థాయి ఉద్యోగం చేస్తున్నారు. గత ఏడాది కాలంగా జాయింట్ డైరెక్టర్ జీ. సుబ్రమణ్య తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆమె ఆరోపించారు.
లైంగిక వేధింపులు ఎక్కువ కావడంతో ఆమె కార్యాలయంలోనే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు. విషయం గుర్తించిన సాటి ఉద్యోగులు ఆమెను ఆసుపత్రికి తరలించి పై అధికారులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు.

తుమకూరు జిల్లా కలెక్టర్ మోహన్ రాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ నంజేగౌడ, జిల్లా పంచాయితీ సీఈవో శాంతారామ్ ఆసుపత్రి చేరుకుని మహిళా అధికారిణి దగ్గర వివరాలు సేకరించారు.
గత సంవత్సరం నుంచి జాయింట్ డైరెక్టర్ సుబ్రమణ్య లైంగికంగా వేధిస్తున్నాడని, ఒంటరిగా ఉన్న సమయంలో మాఇంటికి వస్తావా, ఇస్తావా అంటున్నాడని ఆమె ఆరోపించారు. అంతే కాకుండ ప్రతి నెల మామూళ్లు ఇవ్వాలని పీడిస్తున్నాడని ఆమె ఫిర్యాదు చేశారు.
మహిళా అధికారిణి ఫిర్యాదుపై దర్యాప్తు చేసి సుబ్రమణ్య మీద కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు, పోలీసులు తెలిపారు. ఆమె చికిత్స చేయించుకుని ఇంటికి వెళ్లారని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications