High alert: అక్రమంగా నిర్మించిన దర్గా, కమర్షియల్ కాంప్లెక్స్ నేలమట్టం, హైలర్ట్, బంద్ !

బెంగళూరు/హుబ్బళి: ప్రభుత్వ స్థలంలో అక్రమంగా దర్గా, షాప్ రూమ్ లు నిర్మించారని అధికారులు గుర్తించారు. దర్గా నిర్మించిన ఏరియా చాలా సున్నితమైన ప్రాంతం కావడంతో అక్కడి అక్రమ కట్టడాలు కూల్చి వెయ్యడానికి అధికారులు ఆచితూచి అడుగులు వేశారు. వేకువ జామున బుల్డోజర్లతో వెళ్లిన అధికారులు అక్రమ కట్టడాలు కూల్చి వెయ్యడం ప్రారంభించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఐదు జిల్లాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కర్ణాటకలోని హుబ్బళిలోని బైరివేవరకోప్ప ప్రాంతంలో దర్గాను కొంత భాగం నిర్మించారు. దర్గా నిర్మించే సమయంలో కొంత కట్టడం ప్రభుత్వ భూమిలోకి రావడంతో ప్రజలు సంచరించడానికి, వాహన సంచారానికి ఇబ్బందులు ఎదురైనారు. దర్గాతో పాటు కొన్ని షాపు రూమ్ లో అక్రమ నిర్మించారు.

 Officials demolishing illegally constructed dargah and shop rooms in Hubballi, high alert in five districts in Karnataka.

దర్గా, షాపు రూమ్ లు నిర్మించే సమయంలో రాజకీయ ఒత్తిడితో అధికారులు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపణలు ఉన్నాయి, అయితే పబ్లిక్ ప్లేజ్ లో నిర్మించిన అక్రమ కట్టడాలు, దర్గాలోని కొంత భాగం, షాపు రూమ్ కట్టడాలను తొలగించాలని ప్రభుత్వ అధికారులు నిర్ణయించారు. హుబ్బళిలోని బైరిదేవర కోప్ప సున్నితమైన ప్రాంతంలో కావడంతో అధికారులు ఇంతకాలం వేచి చూశారు.

మంగళవారం అర్దరాత్రి హుబ్ళి-ధారవాడ మెయిన్ రోడ్డు, హుబ్బళి నుంచి బైరిదేవరకోప్ప వెపు ఉన్న అన్ని రహదారులు పూర్తిగా మూసి వేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం వేకువ జామున దర్గా దగ్గరకు బుల్డోజర్లతో అధికారులు వెళ్లారు. అక్రమంగా నిర్మించిన దర్గాలోని కొంచెం కట్టడం, షాపు రూమ్ లో నేలమట్టం చెయ్యడం మొదలు పెట్టారు.

 Officials demolishing illegally constructed dargah and shop rooms in Hubballi, high alert in five districts in Karnataka.

ముందు జాగ్రత్త చర్యగా హుబ్బళితో పాటు ధారవాడ, ఉత్తర కన్నడ, హావేరి, గదగ్ జిల్లాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా బైరిదేవరకోప్ప ప్రాంతానికి అదనపు పోలీసు బలగాలను పంపించారు. ఇతర జిల్లాల నుంచి వాహనాల్లో, ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు బైరిదేవరకోప్ప ప్రాంతానికి రాకూడదని పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+